నేడే కొమురవెల్లి మల్లన్న కల్యాణం

25 Dec, 2016 03:35 IST|Sakshi
నేడే కొమురవెల్లి మల్లన్న కల్యాణం

తోటబావి కల్యాణ మండపం వద్ద ఏర్పాట్లు పూర్తి
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు
సమర్పించనున్న మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: భక్త జనుల కొంగు బంగారం... బండల నడుమ వెలసిన సుందర రూపుడు.. కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి శుభ ఘడియలు వచ్చాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఇంద్రకీలాద్రిపై వెలిసిన కోరమీసం స్వామికి దుర్ముఖినామ సంవత్స రం, మార్గశిర భాద్రపద ద్వాదశి ఆదివారం ఉదయం 10.45 గంటల శుభ ముహుర్తాన మేడలాదేవి, కేతమ్మదేవితో కల్యాణం జరగ నుంది. ఈ క్రతువుతోనే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆలయ అధికారు లు తోటబావి కల్యాణ మండపం వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. మల్లన్న ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. మహారాష్ట్రలోని తమ్ముళ్ళూరులోని రంభాపూరి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ షట్‌ స్థల బ్రహ్మ 1008వ గురువు శ్రీ శివానంద స్వామిజీ మల్లన్న కల్యాణ వేడుక లను పర్యవేక్షించనున్నారు.

స్వామి వారికి భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభు త్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు తలసాని శ్రీని వాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, చందూలాల్‌ తదితరులు కల్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు. మల్లన్న బ్రహ్మోత్సవాలు ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారంతో మొదలై ఫాల్గుణ మాసం చివరి ఆదివారం (ఉగాది ముందు వచ్చే ఆదివారం) అగ్నిగుండాలతో ముగు స్తాయి. మూడు నెలలపాటు ఉత్సవాలు కొన సాగుతాయి. తెలంగాణతోపాటు మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 80 లక్షల మంది భక్తులు ఈ జాతరకు వస్తారని అంచనా. సంక్రాంతి తరువాత వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నంవారంగా, రెండవ ఆదివారాన్ని లష్కర్‌వారంగా, మహాశివరాత్రి లింగోద్భవవారంగా పిలుస్తారు.

మహాశివరాత్రికి పెద్దపట్నం...
మల్లన్న ఆలయంలో మహాశివరాత్రిని పురస్క రించుకుని ఆలయ తోటబావి వద్ద ఫిబ్రవరి 24న శుక్రవారం మహాశివరాత్రికి లింగోద్భవ కాలంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అదే సమయంలో ఆలయ తోట బావి వద్ద ఒగ్గు పూజారులు 48 వరుసలతో పెద్దపట్నాన్ని వేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివసత్తులు ఆ పెద్దపట్నాన్ని తొక్కుకుంటూ ఆ ముగ్గు పిండిని పొలాలలో చల్లుకుంటే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భక్తుల విశ్వాసం.

అగ్నిగుండాలతో జాతర ముగింపు..
మల్లన్న ఆలయంలో ఉగాది ముం దు మార్చి 26న ఆదివారం అగ్నిగుం డాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగు స్తాయి. ఆలయ తోటబావి వద్ద ఆలయ అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో క్విం టాళ్ల కొద్దీ సమిధలను కాల్చి భగభగ మండే నిప్పుల కొలిమిని రాజేస్తారు. ఆల య అర్చకులు ఉత్సవ విగ్రహాలతో అగ్ని గుండాలు దాటుతూ మల్లన్న ఆలయ గర్భ గుడిలోకి చేరి మల్లన్నకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మల్లన్న భక్తులు ఒక్కొక్కరుగా అగ్నిగుండాలు దాటుతూ మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ అగ్నిగుండాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

మరిన్ని వార్తలు