‘ప్లేట్‌’ ఫిరాయించొద్దు!

12 Mar, 2020 10:25 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చోదకులు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్స్‌లో మార్పు చేర్పులు చేయవద్దని కొత్వాల్‌ అంజనీకుమార్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. సక్రమంగా లేని నంబర్‌ ప్లేట్లతో కూడిన వాహనాలను ఎక్కువగా నేరగాళ్లు వినియోగిస్తున్న ఆనవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ తరహా వాహనాలు వినియోగిస్తూ అనేక మంది దాదాపు 2 వేల స్నాచింగ్స్‌ చేశారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే నగరంలో వాహనాల నంబర్‌ ప్లేట్స్‌పై ప్రత్యేక డ్రైవ్స్‌ చేస్తున్నామని   మంగళవారం ఒక్క రోజే 384 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ తరహా నంబర్‌ ప్లేట్లను గమనిస్తే 94906 16555కు వాట్సాప్‌ చేయాలని నగర వాసులకు కొత్వాల్‌ సూచించారు. (కెమెరాకు చిక్కితే చెక్‌ పడుద్ది)

మరిన్ని వార్తలు