కృష్ణ ఆదిత్యకు సివిల్స్‌లో99వ ర్యాంకు

13 Jun, 2014 03:26 IST|Sakshi
కృష్ణ ఆదిత్యకు సివిల్స్‌లో99వ ర్యాంకు

నల్లగొండ అర్బన్ : నల్లగొండ పట్టణానికి చెందిన కె.కృష్ణ ఆదిత్యకు సివిల్స్‌లో 99వ ర్యాంకు దక్కింది. గురువారం వెల్లడించిన ఫలితాల్లో ఆయన ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అతని తల్లిదండ్రులు ఎస్.శంకర్‌రావు - సుజాత నల్లగొండలో లెక్చరర్లుగా పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం వారి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటుంది. వారి పెద్ద కుమారుడు కృష్ణ చైతన్య కూడా ఇప్పటికే ఐఏఎస్‌కు ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. కృష్ణ ఆదిత్య స్థానిక ఆల్ఫా పబ్లిక్ స్కూల్‌లో 1991 నుండి 2000వరకు 1నుండి 10వ తరగతి వరకు చదివాడు. 2002లో విజయవాడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. 2006లో హైదరాబాద్‌లో బీఈ పూర్తి చేశాడు. 2008లో ఎంబీఏ చదివి ఉస్మానియా యూనివర్సిటీ నుండి గోల్డ్‌మెడల్ సాధించాడు. 2009లో గ్రూప్-1 లో 7వ ర్యాంకు సాధించి పోలీస్ అకాడమిలో డీఎస్పీగా శిక్షణ పూర్తి చేశాడు. 2012లో సివిల్స్ రాసి 747వ ర్యాంకు సాధించాడు. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ సాధించి ప్రస్తుతం సిమ్లాలో శిక్షణ పొందుతున్నా డు. నేడు విడుదల చేసిన 2013 సివిల్స్‌లో 99వ ర్యాంకు సాధించాడు.

ఇద్దరు కుమారులు ఐఏఎస్ కావడం గర్వంగా ఉంది :
శంకర్‌రావు- సుజాత మా ఇద్దరు కుమారులు ఐఏఎస్‌కు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. పెద్ద అబ్బాయి కృష్ణ చైతన్య 2012 సివిల్స్‌లో 143వ ర్యాంకు సాధించి ప్రస్తుతం ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పొందుతున్నాడు. చిన్న అబ్బాయి కృష్ణ ఆదిత్య ఐఏఎస్‌కు ఎంపిక కావడం సంతోషకరం.

 

మరిన్ని వార్తలు