తెలంగాణలోకి ప్రవేశించిన కృష్ణా జలాలు

13 May, 2019 14:42 IST|Sakshi

నారాయణపేట జిల్లాలోకి చేరుకున్న జలాలు

రేపు జూరాల జలశయానికి చేరే అవకాశం

సాక్షి, మహబూబ్‌నగర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు కర్ణాటకలోని నారాయణపుర్‌ జలశయం నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. సోమవారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లాలోకి చేరుకున్నాయి. మండు వేసవిలో తాగు నీటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణానది జలాలు తరలి వస్తున్నాయి. పాలమూరు ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను అధిగమించడానికి కేసీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రితో నడిపిన దౌత్యం కారణంగా మూడు రోజుల క్రితం నారాయణపుర్‌ నుంచి జూరాలకు నీటిని విడుదల ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం నాటికి  కృష్ణా జలాలు జూరాల జలశయానికి చేరనున్నాయి.

నారాయణపేట ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి మొదట నారాయణపురకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నారాయణపుర డ్యాం నుంచి జూరాలకు నీటి విడుదల జరుగుతోంది. మొదట 2,110 క్యూసెక్కులతో నీటి విడుదల ప్రారంభమైంది. మరుసటి రోజు 8 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాటికి కృష్ణా జలాలు జూరాల జలశయానికి చేరతాయి అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే 2.5 టీఎంసీల నీటి విడుదల పూర్తయిట్లు ప్రాజెక్టు ఇంజనీరు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆపరేషన్ ముస్కాన్‌: 18 రోజుల్లో 300 మంది..

టీ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు

ఈనాటి ముఖ్యాంశాలు

బోనాల జాతర షురూ

రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట

‘ప్రజల కోసం పని చేస్తే సహకరిస్తాం’

పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

సీఎం మదిలో ఎవరో..?

సీఎం కేసీఆర్‌ స్వగ్రామంలో పటిష్ట బందోబస్తు

ఆదుకునేవారేరీ

పట్టుబట్టారు.. పట్టుకొచ్చారు!

‘నోటీసులుండవు; అక్రమమైతే కూల్చేస్తాం’

హోం మంత్రి మనవడి వీడియో.. వైరల్‌

నేతల్లో టికెట్‌ గుబులు

వ్యయమే ప్రియమా!

రూల్స్‌ ఈజీ

అమ్మాయి చేతిలో ఓడిపోయానని..

ఆర్టీఏ.. అదంతే!

పోలీస్‌లకు స్థానచలనం! 

సాగర్‌ హైవేపై ప్రమాదం: ఇద్దరి మృతి

ఎట్టకేలకు మరమ్మతులు

కడ్తాల్‌లో కారు బీభత్సం

ప్రియుడు మోసం చేశాడని యువతి..

లైన్‌కట్టిన నకిలీగాళ్లు

ప్రమాదకరంగా కాకతీయ కాలువ

బంగారు షాపులో భారీ చోరీ

ఓటమి భయంతోనే పింఛన్ల పంపిణీ: డీకే అరుణ

ఆటోలో మహిళ ప్రసవం

పాపం.. పసివాళ్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’