పాలమూరుకు కృష్ణమ్మ..

22 Jun, 2017 03:25 IST|Sakshi
పాలమూరుకు కృష్ణమ్మ..

- జూరాలకు వరద నేపథ్యంలో ఎమ్మెల్యే ఆలకు సీఎం ఫోన్‌
- కోయిల్‌సాగర్‌ లిఫ్టు పంపులను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి


సాక్షి, మహబూబ్‌నగర్‌: పాలమూరును కృష్ణమ్మ జలాలు ఈ ఏడాది ముందే పల కరించాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండటంతో కోయిల్‌సాగర్‌ లిఫ్టు పంపులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. జూరాలకు ఎగువ నుంచి 7 వేలకు పైగా క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుం డడంతో ప్రాజెక్టులో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోయిల్‌సాగర్‌ లిఫ్టులను ప్రారంభించి చెరువులను నింపాలని సీఎం కేసీఆర్‌ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి బుధవారం  ఫోన్‌ చేసి ఆదేశించారు. దీంతో జిల్లా పర్యట నలో ఉన్న మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఒక పంపును ఆన్‌ చేశారు. ఒక పంపును ఆన్‌ చేయడం ద్వారా 315 క్యూసెక్కుల నీరు పంపింగ్‌ అవుతోంది.

పంపు ద్వారా ప్రాజె క్టులోకి రోజూ 0.05 టీఎంసీల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయకట్టు రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. దారి పొడ వునా ఉన్న గొలుసుకట్టు చెరువులను కూడా నిం పాలని నిర్ణయించారు. కోయిల్‌ సాగర్‌ లిఫ్టు పనులను ప్రారంభించిన తర్వాత మంత్రి  మాట్లాడుతూ సీఎం ముందుచూపు వల్లే పం పులను ప్రారంభించినట్లు తెలిపారు.  జూన్‌ లో ఎత్తిపోతల పంపులను ప్రారంభించడం చరిత్రలో ఇదే ప్రథమమన్నారు.

మరిన్ని వార్తలు