నేరం చేయకపోతే  ఉలుకెందుకు?: కేటీఆర్‌

6 Mar, 2019 03:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డేటా చౌర్యం వ్యవహారంపై టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహ క అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. ఏ తప్పు చేయనప్పుడు ఎం దుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణను ఏపీ పోలీసులతో ఎందుకు అడ్డుకుంటున్నారన్నారు. ‘మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొం గతనం బయటపడుతుంది అనే కదా మీ భయం చంద్రబాబు గారూ?’ అని పేర్కొన్నారు.

100 దేశాల్లోటీఆర్‌ఎస్‌ శాఖలు: కవిత 
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా ఏప్రిల్‌ 27న జరిగే ప్లీనరీ నాటికి వంద దేశాల్లో టీఆర్‌ఎస్‌ శాఖలను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎన్నారై వ్యవహారాల బాధ్యురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ ఎన్నారై సమన్వయకర్తకు సూచించారు. టీఆర్‌ఎస్‌ కొత్త ఎన్నారై శాఖల ఏర్పాటు, శాఖల పని తీరు, కార్యకలాపాలపై కవిత మంగళవారం ఇక్కడి బాధ్యులతో చర్చించారు. కెనడాలో ఇటీవల ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ శాఖతో కలిపి మొత్తం 40 దేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలు ఏర్పాటైనట్లు బాధ్యులు కవితకు వివరించారు. 

ఈము రైతుల రుణాలను మాఫీ చేయండి: వినోద్‌
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని ఈము పక్షుల రైతులకు సంబంధించిన సుమారు రూ.27 కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేయాల్సిందిగా ఎంపీ వినోద్‌ కుమార్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కి ఆయన లేఖ రాశారు. గతంలో స్వయంఉపాధి పథకంలో భాగంగా నాబార్డు సహకారం తో వివిధ బ్యాంకులు 25% రాయితీతో ఈము రైతులకు రుణాలు ఇచ్చాయన్నారు. ఈము పక్షు ల పెంపకం, మార్కెటింగ్‌లో వచ్చిన ఇబ్బందుల కారణంగా రైతులపై రుణభారం పడిందని, బ్యాంకులు రుణగ్రహీతలపై ఒత్తిడి తేవడంతో ఒకరిద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడార న్నారు. రుణాలను మాఫీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈము రైతులను ఆదుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు