పాప వైద్యానికి కేటీఆర్‌ భరోసా

9 Oct, 2019 09:53 IST|Sakshi
ట్విట్టర్‌లో సమాచారం అందించిన కేటీఆర్‌; హాస్పిటల్‌లో వైద్యం పొందుతున్న భూమిక (ఫైల్‌) 

సాక్షి, సూర్యాపేట: బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న సూర్యాపేటకు చెందిన చిన్నారికి వైద్య ఖర్చులకోసం మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం భరోసా ఇచ్చారు.  సూర్యాపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన వల్ధాసు ఉపేందర్‌ ఎనిమిది సంవత్సరాల కూతురు భూమిక  కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బారిన పడింది. దాంతో సూర్యాపేటలోని హాస్పిటల్‌లో చికిత్స నిర్వహించినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో హైదరాబాద్‌ తీసుకెళ్లడంతో బ్రెయిన్‌ ట్యూమర్‌ అని తేలింది. వైద్య ఖర్చులకు రూ.ఎనిమిది లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ట్రైలర్‌ వృత్తే జీవనాధారంగా కాలం వెళ్లదీస్తున్న పాప తల్లిదండ్రులు విషయం తెలిసి రోదిస్తున్నారు. ఆర్థికసాయం అందించాలని దాతలను వేడుకోవడంతో సూర్యాపేటకు చెందిన వారి మిత్రుడు శైలేంద్రాచారి పాప పరిస్థితిని ట్విట్టర్‌లో కేటీఆర్‌కు తెలిపారు. దాంతో ఆయన వెంటనే స్పందించారు. పాపకు సంబంధించినవారిని వెంటనే తన ఆఫీస్‌కు రమ్మని ఆహ్వానించారు. దీంతో పాప తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు