ఘనంగా కేటీఆర్‌ జన్మదినం

25 Jul, 2018 13:09 IST|Sakshi
కేక్‌ కట్‌ చేస్తున్న విద్యార్థులు

నారాయణపేట రూరల్‌: ఐటీ రంగంలో వినూత్న ఒరవడి సష్టించి తెలంగాణ రాష్ట్రానికి మార్గనిర్ధేశనం చేస్తున్న మంత్రి కేటీఆర్‌ను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని టీఆర్‌ఎస్‌వీ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీపాద్‌ పిలుపునిచ్చారు. కేటీఆర్‌ జన్మదిన వేడుకలను  మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచారు. పట్టణంలో మోటర్‌బైక్‌ ర్యాలీ చేపట్టారు.

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సరాఫ్‌నాగరాజు, వైస్‌ చైర్మన్‌ చెన్నారెడ్డి, టౌన్‌ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్‌రెడ్డి, డాక్టర్‌ నర్సింహారెడ్డి, కృష్ణ కోర్‌వర్, కన్న జగదీష్, విజయ్‌సాగర్, ప్రతాప్‌రెడ్డి, వెంకట్, సుమిత్, రాజు, శివ, సిద్దు, వినోద్, అశోక్, ఫయాజ్, అనిల్, చరణ్, కష్ణనాయక్, నరేష్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు