కేటీఆర్‌ బర్త్‌ డే.. ఆర్భాటాలు బంద్‌..!

23 Jul, 2018 21:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం 42వ వసంతంలోకి అడుగుపెట్టుబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు ఒక పాటను బహూకరించారు. కేటీఆర్‌ బర్త్‌డే సాంగ్‌ను ఎమ్మెల్యే​శంభీపూర్‌ రాజు, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆదివారం విడుదల చేశారు. ‘నీలాల మబ్బుల్లో సూర్యుడు.. నువ్వు తెలంగాణ నేల రాముడు’  అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంటోంది.

కాగా, తన జన్మదినం సందర్భంగా కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కేటీఆర్‌ అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ విజ్ఞప్తి మేరకు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తీసేయించారు. ఇక కేసీఆర్‌ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేటీఆర్‌ అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. తనకు కేటాయించిన శాఖల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు