కోటి ఎకరాల మాగాణిగా చేస్తాం

31 Oct, 2018 12:29 IST|Sakshi
లింగంపేట సభలో మాట్లాడుతున్న కేటీఆర్‌

సాక్షి, కామారెడ్డి/నాగిరెడ్డిపేట: ‘జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట.. అట్లనే కాంగ్రెస్, టీడీపీ కలిస్తే బూడిద రాలుతుంది తప్ప ఓట్లు రాలవని’ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశా రు. తెలంగాణ సాధన కోసం తాము అప్పట్లో పొత్తులు పెట్టుకున్నామని, మరి ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌ ఎం దుకోసం పొత్తు పొట్టుకున్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘నాకు పొగరు ఉందని కాం గ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. కానీ, నాకు పొగరు లేదు, పౌరుషం ఉంది. పదవుల కోసం పెదవులు మూసుకునే వ్యక్తిత్వం నాకు లేదని’ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లింగంపేట మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు.

నీళ్లు, నిధులు అందిస్తాం 
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరధి చెప్పారని గుర్తు చేసిన కేటీఆర్‌.. ‘నా తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణి’గా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారని తెలిపారు. కాళేశ్వరం నీటితో 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకం చేపట్టినట్లు వివరించారు. ప్రాజెక్టుల కోసం ఏటా రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ప్రజలకు నీళ్లు, నిధులు అందించడమే లక్ష్యం గా పని చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ అం టేనే కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు అన్నా రు.

అప్పుల ఊబిలో ఉన్న రైతులను రుణవి ముక్తి చేయడమే కేసీఆర్‌ లక్ష్యమని, అధికారంలోకి రాగానే రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు. పంట సాగు పెట్టుబడులకు ఎకరానికి రూ.8 వేలు ఇచ్చామని, ఇక నుంచి రూ.10 వేలు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో ఎరువులు, విత్తనాలను పోలీస్‌ స్టేషన్లలో పెట్టి అమ్మారని, తాము అధికారం చేపట్టాక కావాల్సినన్ని ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని, నిరుద్యోగులకు భృతి కింద రూ.3 వేలు అందిస్తామని తెలిపారు.

పొత్తు ఎందుకో చెప్పాలి? 
తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వలేదని, టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమాలు చేసి సాధించుకున్నారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం పెంచితే అధికారంలోకి రారని, ఆయన సన్యాసుల్లో కలవాల్సిందేనని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీకి అమేథీలో కార్పోరేటర్‌గా గెలిచే సత్తా లేదని,ఇక్కడికొచ్చి కాంగ్రెస్‌ నాయకులు ఏది రాసి ఇస్తే అది చదివి వెళ్తారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడానికి 200 కేసులు వేసినోళ్లకు రైతులపై విశ్వాసం ఉంటుందా? అని మండిపడ్డారు.

కాంగ్రెస్‌తో కోదండరాం ఎలా పొత్తు పెట్టుకుంటారని కేటీఆర్‌ ప్రశ్నించారు. పొత్తులు అంటే షరతులతో కూడిన పొత్తులు ఉండాలన్నారు. తాము తెలంగాణ సాధన కోసం పొత్తులు పెట్టుకుని సాధించామన్నారు. రాబోయో రోజుల్లో 1.09 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఎల్లారెడ్డి నియోజక వర్గంలో నిరుద్యోగుల కోసం ఆహార శుద్ధి కార్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎల్లారెడ్డి నియోజక వర్గానికి 10 టీఎంసీల కాళేశ్వరం నీళ్లు అందించి, సశ్యశ్యామలం చేస్తామన్నారు.

నాలుగేళ్లలోనే విస్తృత అభివృద్ధి.. 
అరవై ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలన కంటే నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తెలిపారు. కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాలను గడప గడపకు తీసుకెళ్లి రవీందర్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. దేశ ప్రధాని సైతం తెలంగాణ వైపు చూస్తున్న పరిస్థితిని కేసీఆర్‌ తెచ్చారన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా తన గెలు పు ఖాయమై పోయిందని, మెజారిటీ కోసమే పోరాడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా దిగజారి పోయిం దని విమర్శించారు. మా జీ ఎమ్మెల్యే జనార్ధన్‌గౌడ్‌ను ఎమ్మెల్సీ చేస్తామని సీఎం కేసీఆర్, కేటీఆర్‌ చెప్పినా ఆగకుండా కాం గ్రెస్‌లో చేరి, మంచి భవిష్యత్తును కోల్పోయాడని తెలిపారు. మహా కూట మి పేరుతో కాంగ్రెస్‌ మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తుందని ఎంపీ బీబీ పాటిల్‌ విమర్శించారు. జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ముజీబొద్దిన్, మాజీ మంత్రి నేరెళ్ల అంజనేయులు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ అయాచితం శ్రీధర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సంపత్‌గౌడ్, ఎంపీపీలు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట సభలో మాట్లాడుతున్న కేటీఆర్‌

సభకు హాజరైన జనాలు 

మరిన్ని వార్తలు