సిరిసిల్లకు రైలు కూత వినిపిస్తాం : కేటీఆర్‌

2 Nov, 2018 18:52 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల : కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని సర్వేలు చెబుతున్నాయని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల కాలేజీ గ్రౌండ్ లో కేటీఆర్‌ కృతజ్ఞత సభలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సహకారం లేకుండా ఏ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. ముసలి నక్క, గుంటనక్కలా కాంగ్రెస్ టీడీపీ నేతలు కాచుకుని కూర్చున్నారని ఎద్దేవా చేశారు. 


చంద్రబాబు నాయుడు మన కరెంటును, నీళ్లను దోచుకెళ్లేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కూటమికి ఓటేస్తే కరెంటు ఉండదు, ప్రాజెక్టులు పూర్తి కావన్నారు. తెలంగాణలో నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది గోరంత, చేయాల్సింది కొండంతా ఉందని తెలిపారు. టీఆర్ఎస్ పై పోటీ చేసే వారి పరిస్థితి చూస్తే పోచమ్మ కాడికి తీసుకెళ్లే గొర్రెలా కనిపిస్తుందన్నారు. చేనేత కార్మికులు కాదు, చేనేత కళాకారులని పిలవాలని సూచించారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి రాబోయే మూడేళ్లలో సిరిసిల్లకు రైలు కూత వినిపిస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుపొంది డిసెంబర్ 13న మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు