కేటీఆర్‌ ట్వీట్‌.. ఫన్నీ వీడియో వైరల్‌

20 Feb, 2019 10:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాలనలో ఎప్పుడూ బిజీగా ఉండే  టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్  బుధవారం సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఎంతో కష్టపడి కంచెకు అవతలివైపు ఉన్న ఫోన్‌ను తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలోనే ఫోన్‌ను తీయడానికి ఉపయోగిస్తున్న కర్ర చేయిజారి కంచెకు అవతలివైపు పడిపోతుంది. చదవక ముందు కాకర కాయ చదివిన తరువాత కికరా కాయ అన్నట్టు ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి కంచె దాటి అవతలివైపు దూకి ఫోన్‌ను కాకుండా కర్రను తీసిచ్చి వచ్చేస్తాడు. సరదాగా ఉన్న ఈ వీడియోకు నెటిజన్లు సైతం తమ కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు. ఇక కేటీఆర్‌ కూడా స్మార్టెస్ట్‌ గై అవార్డు గోస్‌ టూ.. అంటూ ఈ వీడియోను పోస్ట్‌ చేశారు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే బీజేపీలో చేరా: డీకే అరుణ

ఫ్రంట్‌లో కొడుకు, కూతురే: కోమటిరెడ్డి 

వారు రాజకీయ మానసిక  రోగులు: బూర నర్సయ్య

ఎరుకల స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తా

టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏం సాధించారు?’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు

‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి

ఇక ప్రేమ యుద్ధం

గొప్ప మనసు చాటుకున్న మంచు విష్ణు