కరోనాపై పోరాటం: శుభవార్త చెప్పిన కేటీఆర్‌

29 Mar, 2020 18:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ శుభవార్త చెప్పారు. గతంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన 11 కేసులు చికిత్స అనంతరం ఆదివారం జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చాయని తెలిపారు. ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. అంతకు క్రితం ప్రపంచ వ్యాప్త కరోనా మరణాల గ్రాఫ్‌ గురించి ఆయన చర్చించారు. కరోనా పోరులో ప్రపంచ దేశాల కంటే భారత్‌ ఎంతో ముందుందని, చైనా కంటే ఇటలీ, స్పెయిన్‌, యూకే, యూఎస్‌లలో కరోనా వైరస్‌ మరణాల రేటు వేగంగా పెరుగుతోందని తెలిపారు. ( అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌ )

బెల్జియం, భారత్‌ అన్నిటికన్నా ముందే లాక్‌డౌన్‌ ప్రకటించాయని గ్రాఫ్‌లో పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకు 67 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. చికిత్స అనంతరం వీరిలో 12 మందికి కరోనా నెగిటివ్‌ వచ్చింది.

చదవండి : ‘యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేయద్దు’

మరిన్ని వార్తలు