ప్రజల్ని సీజనల్‌ వ్యాధుల నుంచి కాపాడుకోవాలి

17 May, 2020 20:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : సీజనల్‌ వ్యాధుల బారినుంచి కుటుంబాలను, పట్టణాలను, ప్రజలను కాపాడుకోవాలని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.  సీజనల్ వ్యాధులను కలిసికట్టుగా ఎదుర్కొందామంటూ ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పోరేషన్ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్లకు ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో.. ‘‘ ప్రతి ఆదివారం- పది గంటలకి- పది నిమిషాలు’’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు. పురపాలక శాఖ చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలన్నారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు పకడ్బందీ ప్రణాళికతో పురపాలక శాఖ ముందుకు వెళ్తోందని తెలిపారు. పురపాలక శాఖ కార్యక్రమాలతో కలిసి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు