బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌పై త్వరలోనే నిర్ణయం

3 Jul, 2017 20:55 IST|Sakshi
బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌పై త్వరలోనే నిర్ణయం

న్యూఢిల్లీ: విభజన చట్ట ప్రకారం తెలంగాణలో బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర గనుల శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ చౌదరి తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్‌ సోమవారం బీరేంద్ర సింగ్‌తో ఢిల్లీలో సమావేశమై చర్చించారు. విభజన చట్ట ప్రకారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రికి వివరించారు. విభజన జరిగి మూడేళ్ల పూర్తైనా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు విషయంలో ఇంత వరకు పురోగతి లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడైల ఐరన్‌ఓర్‌ మైన్స్‌కు లింక్‌ చేస్తూనైనా ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యం కాదని సెయిల్‌ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అనంతరం తాను ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేశానాని తెలిపారు. ఈ కమిటీ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సానుకూలంగా నివేదిక ఇచ్చే అవకాశం ఉందన్నారు. కమిటీ తుది నివేదిక అందాక హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు