శ్రీనగర్‌ తెలుగు విద్యార్థుల ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్‌

3 Aug, 2019 16:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు వెంటనే శ్రీనగర్‌ ఎన్‌ఐటీ క్యాంపస్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతో విద్యార్థులు తమకు సాయం చేయలంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ట్విట్‌ చేశారు. దీనిపై కేటీఆర్‌ వెంటనే స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తుందని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. విద్యార్థులను శ్రీనగర్‌ నుంచి తీసుకొచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కేటీఆర్‌ అధికారులను కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. సహాయం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ వేదాంతం గిరిని సంప్రదించాలని తెలిపారు. అక్కడి కార్యాలయానికి సంబంధించిన ఫోన్‌ నంబర్లు 011-2338 2041 లేదా +91 99682 99337 కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రెసిడెంట్ కమీషనర్ జమ్మూకశ్మీర్‌ నుంచి విద్యార్థులను ఢిల్లీకి తీసుకు రావడానికి బస్సులు  ఏర్పాటు చేశారని.. అక్కడ నుంచి హైదరాబాద్‌ రావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌ కే జోషి తెలిపారు. నిట్ విద్యార్ధులతో తెలంగాణ భవన్ అధికారులు ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని, వారు ఇప్పటికే శ్రీనగర్ నుండి జమ్మూకు రోడ్డు మార్గాన బయలుదేరారన్నారు. విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు