రానున్న రోజుల్లో రాష్ట్రానికి రూ.45,848 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు
83 వేల మందికి ఉద్యోగావకాశాలు కూడా..
పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘టీఎస్–ఐపాస్ ద్వారా ఇప్పటివరకు రూ.1,96,404 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అనుమతించిన 12,021 పరిశ్రమల్లో 75 శాతం పైగా కార్యకలాపాలను ప్రారంభించాయి. రానున్న రోజుల్లో రాష్ట్రానికి రూ. 45,848 కోట్ల పెట్టుబడులు మెగా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టుల రూపంలో రానున్నాయి, తద్వారా సుమారు 83 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. 2019–20 పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్ మంగళవారం ఇక్కడ ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుతో పోల్చితే 2019–20లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) 8.2 శాతం నమోదైందని మంత్రి పేర్కొన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2018–19లో 4.55 శాతం ఉండగా, 2019–20లో 4.76 శాతానికి పెరిగిందన్నారు.
జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,34,432 తో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,28,216 అన్నారు. దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు. ‘నెట్ ఆఫీస్ అబ్జర్షన్ విషయంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అత్యత్తుమ జీవన ప్రమాణాల విషయంలో హైదరాబాద్ మరోసారి ప్రథమ స్థానం దక్కించుకుంది. నీతి ఆయోగ్ ప్రకటించిన సుస్థిర అభివృద్ధి సూచికల్లో బెస్ట్ పెర్ఫామింగ్ స్టేట్ గా రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. కరోనా సంక్షోభంలో తెలంగాణలోని పరిశ్రమలు పెద్దఎత్తున ప్రభుత్వానికి అండగా నిలిచాయి. రిలీఫ్ ఫండ్ కు రూ.150 కోట్లతో పాటు ఇతరత్రా కాంట్రిబ్యూషన్ రూపంలో అందించారు’అని తెలిపారు.
ఫార్మా రంగంలో..
‘ఏరోస్పేస్’లోనూ సత్తా..
ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టార్లో ఉత్తమ రాష్ట్రంగా కేంద్ర విమానయాన శాఖ నుంచి రాష్ట్రానికి పురస్కారం వరించింది. జీఎంఆర్ విమానాశ్రయం ప్రపంచంలోనే మూడో గ్రోయింగ్ ఎయిర్ పోర్టుగా అవార్డు అందుకుంది. నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్ సుమారు ఐదు డిఫెన్స్ ప్రాజెక్టులను హైదరాబాద్‌కు తీసుకురావడంతో 600 మందికి ఉపాధి లభించనుంది. 2.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.350 కోట్లతో జీఎంఆర్ బిజినెస్ పార్కును శంషాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.300 కోట్లతో ఏడు ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఒక మెగా ఫుడ్ పార్క్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మరో రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు కార్యకలాపాలను ప్రారంభించేందుకు పనులు ప్రారంభించాయి.
చేనేత, వస్త్ర రంగంలో..
రిటైల్ రంగంలో..
20 వేల చదరపు అడుగులతో గచ్చిబౌలిలో తెలంగాణలోనే లార్జెస్ట్ డెలివరీ సెంటర్‌ను అమెజాన్ స్టార్ట్ చేసింది. వాల్ మార్ట్ రాష్ట్రంలో 5వ స్టోర్‌ను వరంగల్‌లో ప్రారంభించింది.