13న నిజాంసాగర్‌కు కేటీఆర్‌ రాక 

5 Mar, 2019 06:49 IST|Sakshi
 మాగి గ్రామ శివారులో స్థలాన్ని పరిశీలిస్తున్న ప్యానల్‌ స్పీకర్, జడ్పీచైర్మన్‌

జహీరాబాద్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశం  

సభాస్థలిని పరిశీలించిన ప్యానల్‌స్పీకర్, జడ్పీచైర్మన్‌ 

నిజాంసాగర్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 13న నిజాంసాగర్‌ మండలానికి రానున్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ సన్నాహక సమావేశానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కేటీఆర్‌ రాక, సభ నిర్వహణకు గాను సోమవారం నిజాంసాగర్‌ మండలం మాగి గ్రామశివారులో సభ స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్బంగా అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌షిండే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తనయుడు, రాష్ట్ర టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాక కోసం ఏర్పాట్లు భారీగా చేస్తున్నామన్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, ఆందోల్‌ నియోజకవర్గాల నుంచి 20వేల మంది ముఖ్యనేతలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా మొట్టమొదటిసారిగా జహీరాబాద్‌ పార్ల  మెంట్‌ నియోజకవర్గ సమావేశాన్ని నిజాంసాగర్‌ మండలంలో నిర్వహించడం అదృష్టమన్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, అసెంబ్లీ స్పీకర్‌ తనయుడు సురేందర్‌రెడ్డి, ఎంపీ పాటిల్, జిల్లా ప్రతినిధులు శంకర్‌ పటేల్, గంగాదర్, బాన్సువాడ డీఎస్పీ యాదగిరి మండల టీఆర్‌ఎస్‌ నాయకులు గైని విఠల్, దుర్గారెడ్డి, కమ్మరికత్త అంజయ్య, రమేష్‌గౌడ్, పీరని సాయిలు, వాజిద్‌ అలీ, మహేందర్, ఇప్తాకర్, కాంత్‌రెడ్డి, చింతకింది రాములు తదితరులు ఉన్నారు.  

నేడు మంత్రి ప్రశాంత్‌రెడ్డి రాక..

రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం నిజాంసాగర్‌ మండలానికి రానున్నట్లు ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌షిండే తెలిపారు. ఈ నెల 13న కేటీఆర్‌ రానుండటంతో మాగి గ్రామశివారులో సభ స్థలాన్ని, ఇక్కడి ఏర్పాట్లను మంత్రి పరిశీలిస్తారన్నారు. మధ్యాహ్నం రెండున్న రకు మంత్రి రానుండటంతో మంత్రి పర్యటనకు నాయకులు తరలిరావాలని ఆయన సూచించారు.


  

మరిన్ని వార్తలు