ఎంజే మార్కెట్‌ను సందర్శించిన కేటీఆర్‌

16 Apr, 2018 21:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చారిత్రక మోజంజాహీ మార్కెట్‌కు పుర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఎంజే మార్కెట్‌ని దత్తత తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ కూడా ఎంజే మార్కెట్‌ పునరుద్దరణకు 10కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ఎంజే మార్కెట్‌ని సందర్శించారు. మార్కెట్‌ లోని వ్యాపారులతో ముచ్చటించిన కేటీఆర్‌.. అక్కడ లభించే ఫేమస్‌ ఐస్‌ క్రీమ్‌ రుచి చూశారు. జీహెచ్‌ఎంసీ చేపట్టబోయే పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కేటీఆర్ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు ,తదితరులు ఉన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పరిపూర్ణానంద బహిష్కరణ అప్రజాస్వామికం

‘ప్రత్యేక’ కసరత్తు షురూ 

నాలుగు డెయిరీలతో ‘విజయ బోర్డు’

మరో 10 క్లస్టర్లివ్వండి 

ముందు కాలుష్యరహితం.. తర్వాతే సుందరీకరణ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సారీ విశాల్‌ !

డేట్‌ ఫిక్స్‌?

సృష్టే సాక్ష్యంగా...

ఒక రోజు ముందే వేడుక

అమ్మపై కోపం  వచ్చింది!

బ్రేవ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌