కేయూ బోటనీ విభాగానికి త్వరలో 50 వసంతాలు పూర్తి     

4 Sep, 2018 14:26 IST|Sakshi
బోటనీ విభాగం 1972–73 బ్యాచ్‌ విద్యార్థులు (ఫైల్‌) 

కేయూ క్యాంపస్‌ : కేయూ బోటనీ విభాగం స్వర్ణోత్సవాలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 9వతేదీతో ఆ విభాగం ఏర్పడి 50 సంవత్సరాలు  పూర్తికానున్న నేపథ్యంలో గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆ విభాగం ఆచార్యులు  సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. ఎమ్మెస్సీ బాటనీ రెండు సంవత్సరాల కోర్సును ఉస్మానియా యూనివర్సిటీ పరి«ధిలో హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌కళాశాల  పీజీసెంటర్‌లో 1968లో ఏర్పాటుచేశారు. ఆ విభాగం ఇన్‌చార్జిగా అప్పట్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విద్యావతి వ్యవహరించారు. అప్పట్లో 12 మంది విద్యార్థులతో ఆరంభమైన ఈ విభాగంను 1970లో న్యూ క్యాంపస్‌కు తరలించారు.

కాకతీయ యూనివర్సిటీ 1976 అగస్టు 19న ఆవిర్భవించిన విషయం విధితమే. కేయూ ఆవిర్భావం తర్వాత క్యాంపస్‌లోనూ అదే బాటనీ విభాగం కొనసాగుతోంది. 1986లో ఈ విభాగాన్ని కొత్త భవనంలోకి  మార్చారు. అన్నిరకాల మౌళిక సదుపాయాలు... సరిపడా క్లాస్‌రూమ్‌లు , ల్యాబరేటరీ వసతి, పచ్చదనంతో బోటనీ బ్లాక్‌  కళకళాడుతోంది. ఈ విభాగంలో మొదటి బ్యాచ్‌ విద్యార్థులు డాక్టర్‌ కె.సుభాష్, డాక్టర్‌ ఎన్‌.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ సిసువర్తా లాంటి వారు ఇక్కడే అదే విభాగంలో ఆచార్యులుగా విద్యా, పరిశోధనాపరమైన సేవలను అందించారు. ఇదేవిభాగంలో పనిచేసిన ఆచార్య  విద్యావతి, డాక్టర్‌ జాఫర్‌ నిజాం కాకతీయ యూనివర్సిటీ వీసీలు గా కూడా పనిచేసి యూనివర్సిటీ అభివృద్ధితోపాటు బాటనీ విభాగం అభివృద్ధికి ఎంతో కృషిచేశారనడంలో అతిశయోక్తిలేదు.

40 బ్యాచ్‌లు, 1500 మంది విద్యార్థులు 

ఎమ్మెస్సీ బోటనీ విభాగంలో 50 సంవత్సరాల్లో ఇప్పటివరకు 40 బ్యాచ్‌లు పూర్తయ్యాయి. 1500ల మంది విద్యార్థులు ఈ విభాగంలో పట్టాలు పొందారు. 268మంది వివిధ అంశాలపై పరిశోధనలు చేసి డాక్టరేట్‌లు పొందారు. 20మంది ఎంఫిల్‌ డిగ్రీ పొందారు. మిగతా విభాగాల కంటే బోటనీలోనే ఎక్కువమంది డాక్టరేట్‌లు పొందడం విశేషం. 

ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు..

ఈ విభాగంలో చదువుకున్న పూర్వవిద్యార్థులలో ఎక్కువ శాతం మంది  ఇంటర్, డిగ్రీ , పీజీ కళాశాలల్లో లెక్చరర్లుగా నూ.. మరి కొందరు ఇతర దేశాల్లోనూ స్ధిరపడ్డారు. ఇంకొంతమంది ప్రభుత్వ రంగ సర్వీస్‌లలో..  (ఐఏఎస్, ఐఎఫ్‌ ఎస్, బోటనీ సర్వే ఆఫ్‌ ఇండియా) ఉద్యోగాలు చేస్తున్నారు. 

పరిశోధనలపరంగా ముందంజ..

బోటనీ విభాగం పరిశోధనపరంగా ముందంజలో ఉంది. రీసెర్చ్‌ ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 1500 రీసెర్చ్‌ పబ్లికేషన్స్‌ను వివిధ జర్నల్స్‌లోనూ ప్రచురించారు. సీనియర్‌ ఆచార్యులు ప్రొఫెసర్‌ బీరహుదూర్, ప్రొఫెసర్‌ ఎస్‌ఎం రెడ్డి పలు టెక్స్స్టబుక్స్‌ కూడా రాశారు. మరికొందరు అధ్యాపకుల రచనలను  ప్లస్‌ 2, డిగ్రీ స్టూడెంట్స్‌ ఇన్‌ వెర్నాక్యులర్‌ లాంగ్వెజెస్‌లో తెలుగు అకాడమీ ప్రచురించింది.

 యూజీసీ, ఏఐసీటీఈ, డీబీటీ, ఐసీఎంఆర్, డీఓఎఫ్‌ఈ తదితర సంస్థల సహకారంతో ఈ విభాగంలో పలు మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులు కూడా పూర్తయ్యాయి. యూజీసీ సహకారంతో సాప్‌ (స్పెషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రాం)కింద  డీఆర్‌ఎస్‌–1,2,3 దశల్లోనూ కేవలం బోటనీ విభాగంలోనే పరిశోధనలు కొనసాగటం గమనార్హం.  ఈ విభాగంలో సాప్‌ కింద పరిశోధనల కోసం మొత్తంగా రూ.2.43కోట్లు మంజూరుకాగా.. డీఎస్‌టీ కింద రూ.1.05 కోట్లు నిధులు ఫిస్ట్‌ ప్రోగ్రాంకు మంజూరయ్యాయి. అంతే కాకుండా బోటనీ విభాగం పలు జాతీయ సదస్సులు, వర్క్‌షాప్‌లు, కాన్ఫరెన్స్‌లకు కూడా వేదికైంది.  

సంవత్సరమంతా స్వర్ణోత్సవాలు 

యూనివర్సిటీలోని బోటనీ విభాగం ఆ«ధ్వర్యంలో గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు సంవత్సరం పొడవునా నిర్వహించనున్నారు. అందుకోసం తొలుత ఈ నెల 9న ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఢిల్లీ), డిపార్టుమెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ డాక్టర్‌ టి మహాపాత్ర , తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టి పాపిరెడ్డి, యోగి వేమన యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ ఏఆర్‌ రెడ్డి, తెలంగాణ ప్రొఫెసర్‌ జయశంకర్‌  అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ప్రవీణ్‌కుమార్, కేయూ వీసీ ప్రొఫెసర్‌ ఆర్‌.సాయన్న, బోటనీ విభాగం పూర్వ విద్యార్థి మహబూబాబాద్‌ ఎంపీ ఆజ్మీరా  సీతారాంనాయక్‌ సైతం పాల్గొంటారు.

ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 10న బోటనీ విభాగం పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించనున్నారు.అంతేగాకుండా పూర్వవిద్యార్థులలో అత్యున్నతస్థాయి వ్యక్తులను, గురువులను సన్మానించనున్నారు. విభాగం సెమినార్‌ హాల్‌లో  రెండు సెషన్లలో  పూర్వ విద్యార్థులు, వివిధసంస్థలకు చెందిన ప్రొఫెసర్లు ఎంవీ రాజమ్, ప్రొఫెసర్‌ లీలా సెహజిరాన్, ప్రొఫెసర్‌ శ్రీనాథ్, డాక్టర్‌జీవీఎస్‌ మూర్తి, డాక్టర్‌ పి గిరి«ధర్‌ , డాక్టర్‌ కేఆర్‌కే రెడ్డి పాల్గొని పలు అంశాలపై  ప్రసంగిస్తారు.

ఎంపీ సీతారాంనాయక్‌ కూడా పూర్వ విద్యార్థే..

బోటనీ విభాగం పూర్వ విద్యార్థి, అంతేగాకుండా ఇక్కడే ఈ విభాగంలోనే అచార్యులుగా పనిచేసిన   ఆజ్మీరా సీతారాంనాయక్‌ మహబూబాబాద్‌ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. ఇదే విభాగంలో అచార్యులుగా పనిచేసిన జాఫర్‌ నిజాం రెండు సార్లు కేయూకు వీసీగా పనిచేశారు. అలాగే ఆచార్యులుగా పనిచేసిన విద్యావతి కూడా కేయూకు వీసీగా పనిచేశారు. మరికొందరు అధ్యాపకులుగా పనిచేస్తూనే రిజిస్ట్రార్, డీన్స్, పరీక్షల నియంత్రణా«ధికారులుగా తదితర  బాధ్యతలను నిర్వహించారు. 

బోటనీ విభాగాన్ని విస్తరించి బీఎస్సీ ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ, బీఎస్సీ బఝెటెక్నాలజీ, అలాగే సుబేదా రిలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌కళాశాలలో ఎమ్మెస్సీ బాటనీ విభా గం ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. ఎస్‌డీఎల్‌సీఈ పరి« దిలో ఎన్విరాన్‌మెంట్‌ సైన్సెస్‌ను కూడా కొనసాగిస్తున్నారు.

అతిథులతో పైలాన్‌ ఆవిష్కరణ

గోల్డెన్‌ జుబ్లి ఉత్సవాల సందర్భంగా రూ. 1.25లక్షలతో పైలాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిని అతిథులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా 200 పేజీలతో పూర్వవిద్యార్థులు, పీహెచ్‌డీ, ఎంఫిల్, రీసెర్చ్‌ప్రాజెక్టులు తదితర వివరాలతో కూడిన వాల్యూమ్‌ను కూడా ఆవిష్కరించనున్నారు.పూర్తికావొస్తున్న ఏర్పాట్లుకాకతీయ యూనివర్సిటీలో బోటనీ విభాగం గోల్డెన్‌జూబ్లీ వేడుకలు ఈనెల 9న ప్రారంభమవుతాయి ఈ మేరకు  ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి.

ఈ ఉత్సవాలను పూర్వ విద్యార్థులు అధ్యాపకులు, పరిశోధకులు విజయవంతం చేయాలి. విభాగంలో పైలాన్‌ను ఆవిష్కరించనున్నాం. తొలిరోజు 9న ఉదయం క్యాంపస్‌లో ప్రొసిషన్‌ కూడా ఉంటుంది. ఆడిటోరియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. పూర్వవిద్యార్థుల సమావేశం కూడా ఉంటుంది.. సంవత్సరం పొడుగునా ఉత్సవాలు ఉంటాయి. ఈనెల 10న పలు కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాల పర్యవేక్షకులుగా రిటైర్డ్‌ ఆచార్యులు, ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకులు  ప్రొఫెసర్‌ ఎస్‌ రాంరెడ్డి, ఆజ్మీరా రాగన్, డాక్టర్‌ వి కృష్ణారెడ్డి, డాక్టర్‌ టి క్రిష్టోఫర్, డాక్టర్‌ ఎండీ ముస్తాఫా, డాక్టర్‌ ప్రొలారామ్, ప్రొఫెసర్‌ ఏ సదానందం తదితరులు వ్యవహరిస్తున్నారు. 

–  డాక్టర్‌ ఎం  సురేఖ, కేయూ బోటనీ విభాగం అధిపతి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంటర్‌ బోర్డు: గడువు పెంచినా ప్రయోజనమేది?

ఇంటర్‌ కూడా పూర్తి చేయని సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు

సర్వే షురూ..

‘పై’ హోదా.. ‘కింది’ పోస్టు!

ఏసీకి ఏరీ?

హోర్డింగ్‌ డేంజర్‌

పూల్‌.. థ్రిల్‌

ఇంటర్‌పై ఇంతటి నిర్లక్ష్యమా..!

ఊపందుకోని వరి ధాన్యం కొనుగోళ్లు

‘సైన్మా’ సూపర్‌ హిట్‌

భారతీయ పురుషుల్లో వంధ్యత్వం

వెలుగుల తళుకులు.. లాడ్‌బజార్‌ జిలుగులు

మట్టి స్నానం..మహా ప్రక్షాళనం

నిరీక్షణే..!

ఆ యువకుడిని భారత్‌కు రప్పించండి: దత్తాత్రేయ

రెండోరోజు ‘జెడ్పీటీసీ’కి 154 నామినేషన్లు 

ఎస్‌ఈసీ ఆఫీసులో గ్రీవెన్స్‌ సెల్‌ 

జాతీయ సమైక్యతకు  నిదర్శనం: డీజీపీ 

ఆడా ఉంటా.. ఈడా ఉంటా

అక్కడా వారిదే పెత్తనం!

తెలంగాణలో అసమర్థ  పాలన: రాపోలు

బాధాతప్త హృదయంతో నిర్ణయం తీసుకున్నా!

మోదీపై నిజామాబాద్‌ రైతుల పోటీ 

వరంగల్‌ మేయర్‌పై కసరత్తు 

రాజకీయ తీవ్రవాదిగా మారిన కేసీఆర్‌

ఇంత జరుగుతున్నా పట్టింపు లేదు!

వెలుగులోకి ఐసిస్‌ ఉగ్రవాది వ్యవహారాలు

ప్రభాస్‌కు ఊరట

కేంద్రం నిధులు ఇవ్వకుంటే చట్టాన్ని అమలు చేయరా?

చెప్పిందొకటి.. చేసిందొకటి..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అల్లుడి కోసం రజనీ

బిందుమాధవికి భలేచాన్స్‌

అధర్వ, హన్సిక చిత్రానికి డేట్‌ ఫిక్స్‌

‘దర్బార్‌’లో నయన్‌ ఎంట్రీ

స్వీట్‌ సర్‌ప్రైజ్‌

ట్రైలర్‌ బాగుంది  – ప్రభాస్‌