కువైట్‌లో అత్యవసర క్షమాభిక్ష 

4 Apr, 2020 07:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ మోర్తాడ్‌ (బాల్కొండ): కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో కువైట్‌ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తోన్న, చిల్లర నేరాలకు పాల్పడిన విదేశీయులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించింది. స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారందరినీ వారి మాతృదేశాలకు పంపేందుకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 1 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు కువైట్‌ ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. దీనికోసం వివిధ దేశాలవారికి వేర్వేరు తేదీలను కేటాయించగా, భారతీయులకు 11 నుంచి 14వ తేదీలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. భారత్‌లో 14వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేసిన క్రమంలో ప్రత్యేక అనుమతి కోసం భారత ప్రభుత్వంతో కువైట్‌ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి.

మరిన్ని వార్తలు