‘ఎల్‌ అండ్‌ టీ’కి అవార్డు 

7 Nov, 2019 03:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌ సంస్థ (ఎంఆర్‌హెచ్‌ఎల్‌) అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘డైనమిక్‌ సీఐవో స్మార్ట్‌ ఇన్నోవేటర్‌ అవార్డు’ను అందుకుంది. క్లౌడ్‌ ఆధారిత మానవ వనరుల వ్యవస్థ ‘డారి్వన్‌ బాక్స్‌ హెచ్‌ఆర్‌ఎంఎస్‌’ను అమలు చేసినందుకుగాను ఈ అవార్డును అందుకుంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఎంటర్‌ప్రైజ్‌ ఇన్నోవేషన్‌ సదస్సు–2019లో ఎల్‌ అండ్‌ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ తరఫున ఐటీ, ఎంటర్‌ప్రైజెస్‌ హెడ్‌ అనిర్బన్‌ సిన్హా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎల్‌ అండ్‌ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ అండ్‌ సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ఈ అవార్డు తమ సంస్థకు ఎంతో గర్వకారణమని అన్నారు. అత్యుత్తమ శ్రేణి సాంకేతికతను అందించ డంతో పాటు, వినియోగంలోనూ తమ నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని కొనియాడారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు