గురుకులాల్లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సులు

16 Oct, 2019 08:30 IST|Sakshi
మొక్క నాటుతున్న గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే బాలరాజు

విద్యార్థులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని

గురుకులాల రాష్ట్ర  కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

సాక్షి, అచ్చంపేట: రాష్ట్రంలోని 34 గురుకుల పాఠశాలల్లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సులను ప్రారంభించినట్లు గురుకులాల రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో రూ.1.50 కోట్లతో నిర్మించిన అదనపు గదులు, కస్తూర్భా బాలికల విద్యాలయంలో నూతనంగా నిర్మిం చిన జూనియర్‌ కళాశాల భవనాన్ని మంగళవారం గురుకులాల కార్యదర్శి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం గురుకులాల పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియో గం చేసుకొని విద్యార్థులు చదువుల్లో రాణించాలని కోరారు. రాష్ట్రంలో ల్యాబ్‌ టెక్నిషియన్‌ కోర్సులతో పాటు 53 మహిళా డిగ్రీ కళాశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. కస్తూర్భా విద్యాలయాల్లో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులను మహిళా డిగ్రీ కళాశాలలకు పంపాలని ఆయన సంబంధిత విద్యాలయాల ప్రిన్స్‌పాల్స్‌ను కోరారు.

రాబోయే కాలంలో గురుకులాలను సమర్థవంతంగా నిర్వహించుటకు తగు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు  ఆడ పిల్లల చదువుల విషయంలో సమస్యగా మారకుండా స్వేచ్ఛగా చదువుకునేలా వాతావరణం కల్పించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాల రూపు రేఖలే మారాయన్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన విద్యార్థుల సంక్షేమం కోరుతూ అనేక అన్ని వర్గాల వారికి గురుకుల

విద్యను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
సమస్యలను అధిగమించి ఆత్మగౌరవంతో చదువు కోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను హక్కుగా భావించి సద్వినియోగం చేసుకోవా లని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, ప్రిన్స్‌పాల్స్‌ నాగభూషణం, శారద, ఎంఈఓ చంద్రుడు, జెడ్పీటీసీ సభ్యు రాలు నేజమ్మ, ఎంపీపీ లింగమ్మ, స ర్పంచ్‌ కోనేటి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు