ఈవీఎంలు, వీవీప్యాట్‌లలో ఓట్ల తేడాలెందుకు?

31 Jan, 2019 05:00 IST|Sakshi

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ 

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయ్‌

 ఓట్ల శాతాన్ని లెక్కించేందుకురెండు రోజులెందుకు పట్టింది? 

అనుమానాలను నివృత్తి చేస్తే  క్షమాపణలు కోరుతా

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. ఎన్నికల అనంతరం ఓట్ల శాతాన్ని లెక్కిం చేందుకు ఎన్నికల సంఘానికి రెండు రోజుల సమయం ఎందుకు పట్టింది? ఈవీఎంలలో, వీవీ ప్యాట్‌లలో ఓట్ల తేడాలెందుకొచ్చాయన్న అనుమా నాలు నివృత్తి చేయాలన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో జరిగిన పంచా యతీ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాల్సిన ప్రతిపక్షాలు పుంజుకున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలను నివృత్తి చేస్తే తన సర్వే ఫలితాలు తప్పని క్షమాపణలు కోరు తా నన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తాను వెల్లడించిన ఫలితాలకు భిన్నంగా ఫలితాలు రావడం ఆశ్చర్యం కలిగించిందని, దీనికి గల కారణాలు బేరీజు వేసు కొని పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం ఫలితాలతో పాటు వెల్లడిస్తానని చెప్పారు. ఇక నుంచి తాను ఎన్ని కలకు ముందే సర్వే ఫలితాలను వెల్లడించబోనని చెప్పారు. కొన్నేళ్లుగా సర్వే ఫలితాలు చెబుతున్నానని, ఎన్నడూ తప్పు చెప్పలేదన్నారు. బెట్టింగులు చేసేవా డినైతే తనకు కావాల్సిన వారికి అనుకూలంగా చెప్పు కొనే వాడినన్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్ర బాబును కలిసి చర్చించిన విషయాలు బయటకు చెప్పుకొనేవైతే లోపల కూర్చొని ఎందుకు మాట్లాడు కుంటామని ప్రశ్నించారు. బయటకు చెప్పుకొనే విషయాలు కాదు కాబట్టే లోపల కూర్చొని మాట్లా డుకున్నామని, లేదంటే మీడియా ముందుకొచ్చే మాట్లాడుకొనేవారమని చెప్పారు. తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తి కాదని, ఎంతో మందిని కలుస్తుం టానని, అలాగే బాబును కలిశానని చెప్పారు. 

బాబు అండ్‌ కో మళ్లీ దొంగ ఎత్తులు 
ఈవీఎంలు, వీవీప్యాట్లపై లగడపాటి అను మానాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీలు ఈవీఎంలను, వీవీ ప్యాట్లను ట్యాపరింగ్‌ చేసే అవకాశం ఉంటే ఇటీ వల మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయానికి చేరువగా ఉన్న చంద్రబాబు, ఆయన కోటరీ, ఎల్లో మీడియా దొంగ సర్వేలు, ఇతర ఎత్తుగడలతో ప్రజలను మభ్యపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఓటమి గండం నుంచి గట్టె క్కేందుకు బాబు పడరాని పాట్లు పడుతున్నారు.

హడావుడిగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. దొంగ సర్వేలతో ప్రజలను ఏమార్చేం దుకు యత్నిçస్తున్నారు. లగడపాటి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలతో అర్ధరాత్రి వరకు తన నివాసంలో మంతనాలు సాగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా లగడపాటిని బాబు తెరపైకి తీసుకొచ్చారు. ముందుగా తెలం గాణలో ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలుస్తా రని చెప్పిన లగడపాటి పోలింగ్‌కు ముందు రోజు కూటమిదే విజయమన్నారు. కానీ, కూటమికి పరాభవం తప్పలేదు.  ఇప్పుడు కూడా అవే ఎత్తుగడలతో బాబు ఏపీ ప్రజలను మభ్యపెట్టేలా వ్యూహాలు పన్నుతున్నారు.  


 

మరిన్ని వార్తలు