పరిహారం ఇస్తారా.. చావమంటారా?

30 Sep, 2014 01:45 IST|Sakshi
పరిహారం ఇస్తారా.. చావమంటారా?

అధికారులను నిలదీసిన భూ నిర్వాసితుడు
 నర్సింగపూర్(చందుర్తి): పరిహారం పంపిణీలో అన్యాయం జరిగిందనే మనస్తాపంతో అధికారుల ఎదుటే ఓ రైతన్న ఆత్మహత్యాయత్నం చేశాడు. చందుర్తి మండలం నర్సింగపూర్  ఊరచెరువును.. ఎల్లంపల్లి ప్రాజెక్టు రెండో దశలో రిజర్వాయర్‌గా నిర్మిస్తున్నారు. ఇందులో రైతు దేవయ్య పొలం, బావి కోల్పోయాడు. తనకు అందాల్సిన పరిహారాన్ని భూసేకరణ అధికారులే ఇతర రైతుల పేర్లపై నమోదు చేశారని దేవయ్య ఆరోపించాడు.

భూసేకరణ డెప్యూటీ తహశీల్దార్ రాజమణి సోమవారం గ్రామంలో పరిహారం చెక్కులు పంపిణీ చేస్తుండగా దేవయ్య గోడు వెల్లబోసుకున్నాడు. పరిహారం అందకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పురుగుమందు డబ్బా వెంటతెచ్చుకున్నాడు. తప్పిదాలను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతు వెనుదిరిగాడు.

మరిన్ని వార్తలు