భూకబ్జాలు, రౌడీయిజం చేసే వారిపై పీడీ యూక్ట్

27 Nov, 2014 02:20 IST|Sakshi

నేర సమీక్ష సమావేశంలో డీఐజీ మల్లారెడ్డి
వరంగల్‌క్రైం : భూకబ్జాలకు పాల్పడుతూ రౌడీయిజం చెలాయించేవారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన  తర్వాత మొదటిసారిగా వరంగల్ రూరల్, అర్బన్ పోలీసు అధికారులతో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ చరిత్ర ప్రసిద్ధికెక్కిన వరంగల్ జిల్లాలో విధులు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని, దేశంలోనే వరంగల్ జిల్లా పోలీ సులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

గతంలో జిల్లాలో ఉన్న మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించి దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలిచామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని ఈ సమస్యలను పరిష్కరించే దిశగా మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగరంలో రౌడీయిజాన్ని తరిమివేయాలంటే పీడీ యాక్ట్ ఉపయోగించక తప్పదని, ఇందుకోసం పోలీస్‌స్టేషన్లవారిగా ముఖ్యమైన రౌడీలను గుర్తించాలన్నారు. ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా మాట్లాడుతూ భూపాలపల్లి బ్యాంక్ దోపిడీ ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులు తమ పరిధిలోని బ్యాంకుల భద్రతపై బ్యాంకు అధికారులతో సమీక్షించాలన్నారు.

సమావేశంలో అర్బన్, రూరల్ పోలీస్‌స్టేషన్ల పనితీరుతోపాటు అధికారులు, సిబ్బంది పనితీరుపై సమీ క్ష జరిపారు. సమావేశంలో అర్బన్, రూర ల్ అదనపు ఎస్పీలు యాదయ్య, అనిల్ కుమార్, జాన్‌వెస్లీతోపాటు కాజీపేట, హన్మకొండ, వరంగల్, మామునూరు, ములుగు, పరకాల, మహబూబాబాద్, జనగామ, ట్రాఫిక్ డీఎస్పీ లు జనార్దన్, శోభన్‌కుమార్ , సురేంధ్రనాథ్, మహేందర్, రాజమహేంద్రనాయక్, సంజీవరావు, నాగరాజు, సురేందర్, వెంకటేశ్వర్‌రావుతోపాటు సీఐ, ఆర్‌ఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు