తుదిదశకు ‘డిండి’ అలైన్‌మెంట్‌!

25 Mar, 2017 03:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:   డిండి ప్రాజెక్టు అలైన్‌మెంట్‌కు వ్యాప్కోస్‌ సూచించిన రెండో ప్రతిపాదన దాదాపు ఖాయమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అంత ర్భాగంగా ఉండే నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకునే ఈ ప్రక్రియకు నీటి పారుదల శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, ఈ అలైన్‌ మెంట్‌ కారణంగా కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టుకు కలిగే నష్టాన్ని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం చేయనుంది. నార్లాపూర్‌ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్‌మెంట్‌తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలు అభ్యంత రాలు లేవనెత్తారు.

దీంతో కల్వకుర్తి ఆయకట్టుకు నష్టంలేకుండా  నీటిని తీసుకెళ్లే ప్రత్యామ్నాయాలపై నివేదిక ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాప్కోస్‌ సంస్థకు ఆదేశాలిచ్చారు. వ్యాప్కోస్‌ 5 ప్రత్యామ్నాయాలను చూపింది. రెండో ప్రతిపాదనలో రంగాయపల్లి పంప్‌హౌస్‌లో పంపింగ్‌ మెయిన్‌ తగ్గించి, గ్రావిటీ టన్నెల్‌ ఏర్పాటు చేయాలని, దీనికి  3,384.47కోట్లు అవుతుందని తెలిపింది. నార్లాపూర్‌ నుంచి డిండికి  50 కి.మీ. దూరం కాల్వల ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా దీన్ని ప్రతిపాదించారు.

>
మరిన్ని వార్తలు