ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మెట్రో నేడే

24 Sep, 2018 01:28 IST|Sakshi

     లాంఛనంగా ప్రారంభించనున్న గవర్నర్‌ నరసింహన్‌ 

     16 కిలోమీటర్ల మార్గం దాదాపు పనులు పూర్తి 

     మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రజలకు అందుబాటులోకి..

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ (16 కి.మీ.) మార్గంలో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతా చోట్ల ఇప్పటివరకు పార్కింగ్‌ వసతులు అందుబాటులో లేవు. ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్‌ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కి.మీ. దూరంలో ఉన్న మియాపూర్‌కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి.

ఆ తరవాత రైళ్ల ఫ్రీక్వెన్సీ 2 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లో మెట్రో ప్రారంభంతో ఎంజీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌ డిపో, మలక్‌పేట్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్‌ నరకం నుంచి ఉపశమనం కలగనుంది. ఈ రూట్లో అసెంబ్లీ–ఎంజీబీఎస్‌ మార్గంలో పలు చారిత్రక కట్టడాలున్న నేపథ్యంలో ఐదు కిలోమీటర్ల మార్గంలో దక్కనీ, ఇండో పర్షియన్‌ కళాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. తొలిరోజు సుమారు 50 వేలు.. తర్వాత నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కూరెళ్లకు దాశరథి పురస్కారం

‘బీజేపీలో ఎప్పుడు చేరేది త్వరలోనే చెబుతా’

చెవిమోతలో గ్రేటర్‌ ఫైవ్‌

యాసిడ్‌, ఫినాయిల్‌ కలిపి తాగి ఆత్మహత్యాయత్నం

రూ.100 ఇస్తామన్నా.. రూ.30 చాలట!

సీఎం దాకా వద్దు.. మేం చేసి పెడతాం

ఆ హెచ్‌ఎం తీరు.. ప్రత్యేకం 

జవాబుదారిలో భారీ మార్పులు

మదర్సాకు చేరిన పిల్లలు

గోదారి గుండె చెరువు

ప్యాసింజర్‌ రైలును పునరుద్ధరించాలి

ఒక కోడి.. 150 గుడ్లు

రూ.15 వేల కోట్లయినా కడతాం..

కాంగ్రెస్‌లో ‘కంగాళీ’

హెరిటేజ్‌ ఓ జోక్‌లా మారింది!

7 కొత్త కార్పొరేషన్లు

నీళ్ల నిలువను, విలువను తెలిపే థీమ్‌పార్క్‌ 

నిలబెట్టుకోలేక నిందలా!

‘ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే ’

బీజేపీలో నాకు తలుపులు మూసుకుపోలేదు..

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఈనాటి ముఖ్యాంశాలు

కేటీఆర్‌.. మీతో ఛాయ్‌ కా, ఇంకేమైనా ఉందా?

అంత తొందరెందుకు..? 

గెలుపు ఓటముల్లో అతివలదే హవా..

లక్ష మందితో బహిరంగ సభ: ఎమ్మెల్యే

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

రామయ్యా.. ఊపిరి పీల్చుకో 

బాలిక కిడ్నాప్‌ కలకలం 

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ