చేరికల ఓట్లు పడేది ఎటో..? 

14 Nov, 2018 15:32 IST|Sakshi

జంప్‌ జిలానీలతో నేతల ఆందోళన 

చేరినోళ్లంతా ఓటు వేస్తారా అని సందేహాలు 

పోలింగ్‌కు మరో 25రోజుల సమయం 

బలసమీకరణలో తలమునకలైన పార్టీలు

సాక్షి,కామారెడ్డి: ఎన్నికల ముంగిట ప్రధాన పార్టీల్లో కార్యకర్తల చేరికలు జోరుగా సాగుతున్నాయి. అన్ని పార్టీల్లో నూ, అన్ని ప్రాంతాల నుంచి చేరికలు జరుగు తుండటం కామరెడ్డి నియోజకవర్గంలో నాటకీయ పరిణామాలకు దారితీస్తుంది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పాటు బీజేపీలోనూ చేరికల పర్వం కొనసాగుతోంది. ఇలా అన్ని పార్టీల్లోనూ నిత్యం చేరికలు జరుగుతుండటం చూస్తుంటే చివరికి నియోజకవర్గ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారనేది నేతలకే అంతుచిక్కడం లేదు. పార్టీల్లో చేరికలపై తలెత్తుతున్న సందేహాలు ఎక్కడకు వెళ్లినా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

 జోరుగా చేరికలు..

కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రధాన పార్టీ ల అభ్యర్థులందరూ రాజకీయాల్లో ఉద్దండులే. ఎన్నోఏళ్లుగా వారు నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తున్నారు. అన్ని మండలాల్లోనూ వారికి బలమైన క్యాడర్‌ ఉంది. అనుకున్న దానికంటే ఎన్నికల వేడి ముందస్తుగానే రాజుకుంది. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పట్టు సాధించింది. పార్టీ మారిన మొదటి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌కు క్షేత్రస్థాయి నుంచి సంబంధాలున్నాయి. బలమైన క్యాడర్‌ ఆ యనకు ఉంది. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన ఆయన ఈ సారి భారీ మెజార్టీ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నా రు. జిల్లా కేంద్రంలోని ఆయన ఇంటివద్ద నుంచే పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నా రు. నెలరోజుల ముందు నుంచే టీఆర్‌ఎస్‌ లో చేరికలు జోరుగా సాగుతున్నాయి.

కాం గ్రెస్‌ పార్టీకి ప్రధానబలమైన మాచారెడ్డి మం డలానికి చెందిన లోయపల్లి నర్సింగ్‌రావు కాంగ్రెస్‌ను వదిలి అనుచరవర్గంతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. మండలానికి చెందిన ఎంతో మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్‌లు, పార్టీ నాయకులు ఆయనతో పాటు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్‌కు గట్టిదెబ్బ తగిలినట్లయింది. ఆ వెంటనే అదే మండలం నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు జోరుగా సాగాయి. శాసన మండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ సమక్షంలో ఆయా పార్టీల నుంచి నాయకులను, కార్యకర్తలు కాంగ్రెస్‌ గూటికి చేరికలు జరిగాయి. రెండు రోజుల క్రితం మాచారెడ్డి ఇన్‌ఛార్జి ఎంపీపీ అధికం నర్సాగౌడ్‌ టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. జిల్లాకేంద్రం నుంచి కూడా పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరగా, పలు యూనియన్లు, కుల సంఘాల ప్రతినిధులు ఆయా పార్టీలోకి మారుతున్నారు. బీజేపీలోకి యువకులు ఎక్కువగా చేరుతున్నారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సమక్షంలోనూ నిత్యం చేరికలు కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 జంప్‌ జిలానీలు సైతం..

 ఆయా పార్టీలకు జంప్‌ జిలానీలతో సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడమే కాకుండా ఒక్కరోజు వ్యవధిలోనే రెండు పార్టీల జెం డాలు కప్పుకునే నాయకులు సైతం దర్శ నమిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు సై తం కామారెడ్డి నియోజకవర్గంలోని పలుచో ట్ల ఎదురయ్యాయి. నేతలకు ఇలాంటి నాయకుల తీరు తలనొప్పిగా మారింది. ఏదీ ఏమైనప్పటికి పార్టీల్లో చేరుతున్న నాయకులు, కార్యకర్తలు ఏ మేరకు ఆయా పార్టీలకు న్యాయం చేస్తారో చూడాల్సి ఉంది. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో పార్టీ చేరికలపై సర్వత్రా చర్చలు జరుగుతున్నా యి. పోలింగ్‌కు మరో 25 రోజులు సమ యం ఉండడంతో పార్టీలలో చేరికలతో పా టు అన్ని రకాలుగా పోలింగ్‌కు సిద్ధమయ్యేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు బల సమీకరణలో నిమగ్నమయ్యారు. 

మరిన్ని వార్తలు