ధన ప్రభావంపై చర్చ జరగాలి

13 May, 2017 04:36 IST|Sakshi
ధన ప్రభావంపై చర్చ జరగాలి

‘బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు’ వాదన సరికాదు: ఎంపీ వినోద్‌
ట్యాంపరింగ్‌కు తావు లేకుండా మెరుగుపర్చాలి: ఉమ్మారెడ్డి
ఈవీఎంల వివాదంపై ఢిల్లీలో ఈసీ చర్చ


సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎంలపై 2010లో జరిగిన చర్చలోనే ‘ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీప్యాట్‌)’ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారని... అందువల్ల బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే వాదన సరికాదని ఎంపీ బి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈవీఎంల వివాదంపై శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది.

దీనికి ఏడు జాతీయ పార్టీలతో పాటు 48 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ తరఫున వినోద్‌ కుమార్, వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీడీపీ తరఫున ఎంపీ మాల్యాద్రి పాల్గొని.. అభిప్రాయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవీఎంలను టీఆర్‌ఎస్‌ స్వాగతిస్తోందని, దేశంలో ఎన్నికల సంఘం తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తోందని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సమర్థవంతమైన ఈవీఎంలను రూపొందించుకోవాలని సూచించారు. ఈవీఎంలో ఏడు సెకన్లుగా ఉన్న ఓటు సమయాన్ని కొద్దిగా పెంచాల్సిన అవసరం ఉందని.. కేవలం ఏడు సెకన్లు అంటే ఓటరు ఆందోళన చెందే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల్లో ధన ప్రభావం, నగదు పంపిణీపై చర్చ జరగాల్సి ఉందని వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రలోభపెట్టడం అంటే ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

సమస్యలు రాకుండా ఈవీఎంలను సరిదిద్దాలి: ఉమ్మారెడ్డి
ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయంటూ తిరిగి బ్యాలెట్‌ విధానాన్ని అనుసరించాలన్న వాదన సరికాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశంలో స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ట్యాంపరింగ్‌కు తావులేని విధంగా మెరుగుపర్చాలని చెప్పారు. తాము ఎవరికి ఓటు వేశామో తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తే అపోహలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం ఫిరాయింపులపై చర్యలు తీసుకునే బాధ్యతలను కూడా చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాం: టీడీపీ
ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నామని, బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి కోరారు. ఎన్నికల సంఘం ఎంత పటిష్టంగా నిర్వహించాలనుకున్నా.. కింది స్థాయిలో సిబ్బందిని ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చింతమడక స్కీమ్‌’ అని పెట్టినా ఓకే..కానీ

ఈనాటి ముఖ్యాంశాలు

గుండాల ఎన్‌కౌంటర్‌ : హైకోర్టు కీలక ఆదేశాలు..!

యాదాద్రిలో కలకలం: జింక మాంసంతో విందు

కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ

చార్మినార్‌ ఘటనలో కానిస్టేబుల్‌ సస్పెండ్‌

థర్మల్ విద్యుత్‌లో ‘మేఘా’ ప్రస్థానం

నయీం కేసులో రాజకీయ నాయకులపై చర్యలేవీ?

ఆసియా దేశాల సదస్సుకు తెలంగాణ ఎన్నారై అధికారి

ఉప సర్పంచ్‌ నిలువునా ముంచాడు..!

పేదలకు వైద్యం దూరం చేసేలా ప్రభుత్వ వైఖరి

తస్మాత్‌ జాగ్రత్త..!

‘కిషన్‌ది ప్రభుత్వ హత్యే’

లోన్‌ సురక్ష విస్తరణ సేవలు ప్రారంభం

పైసలు లేక పస్తులు 

హామీలను మరిచిన కేసీఆర్‌

నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు

ఆపరేషన్‌కు సహకరించడం లేదని...

ఫేస్‌బుక్‌ మిత్రుల ఔదార్యం

‘హాజీపూర్‌’ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు

శ్రీ చైతన్య.. కాదది.. తేజ

ఇంకా మిస్టరీలే!

ఈ ఆటో డ్రైవర్‌ రూటే సెపరేటు

అతి చేస్తే ఆన్‌లైన్‌కి ఎక్కుతారు.. 

చైన్‌స్నాచర్లపై తిరగబడ్డ మహిళలు 

సుల్తాన్‌పూర్‌లో దొంగల బీభత్సం 

ముమ్మాటికీ బూటకమే.. 

పైసలిస్తేనే సర్టిఫికెట్‌! 

వైద్యం అందక గర్భిణి మృతి

పోలీసు పిల్లలకూ ‘జాబ్‌ కనెక్ట్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఉప్పెనలో ఉన్నాడు

గన్‌దరగోళం

గ్లామర్‌ రోల్స్‌కి ఓకే

ఆటకి డేట్‌ ఫిక్స్‌

స్కెచ్‌ కంప్లీట్‌

చరిత్ర మరచిపోయిన లీడర్‌