ఎక్కడి నాయకులు అక్కడే.. 

22 Nov, 2018 16:25 IST|Sakshi

సిరిసిల్ల: ముందస్తు ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియగానే సీఎం కేసీఆర్‌ సిరిసిల్లలో మంగళవారం సభ నిర్వహించడం టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కేటీఆర్‌ సాదాసీదాగా నామినేషన్‌ దాఖలు చేయగా మంగళవారం నిర్వహించిన సీఎం సభకు మాత్రం భారీ జనసమీకరణ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి జనాలను సమీకరించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల అభ్యర్థులు కేటీఆర్, రమేశ్‌బాబు సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులతో సభ సక్సెస్‌ చేయాలని స్పష్టం గా చెప్పి ఆ మేరకు జనాన్ని సమీకరించి విజయవంతమయ్యా రు. టీఆర్‌ఎస్‌కు ఇదే పెద్దసభ కావడంతో ఇకక్షేత్రస్థాయి ప్రచా రంలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి.

ఎక్కడి నాయకులు అక్కడే..
ఏ ఊరు నాయకులు ఆ ఊరిలోనే క్షేత్రస్థాయిలో ప్రచారాలు ని ర్వహించాలని మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించాలన్నారు. గడపగడపకూ గులాబీజెండా చేరాలని, ప్రతీ ఓటరుకు గులాబీ పార్టీ చేసిన ప్రయోజనాలను వివరించాలని కేటీఆర్‌ ఉద్బోధించారు.  ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, ఏఎంసీ, సింగిల్‌విండో చైర్మన్లు, సింగిల్‌విండో, ఏఎంసీల డైరెక్టర్లు, సెస్‌ డైరెక్టర్లు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పల్లెబాటపట్టాయి. ఈ పక్షం రోజులు పనిచేయాలని గులాబీబాస్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో పటిష్టమైన ప్రణాళికతో గెలుపుకోసం టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది.

సభలో సీఎం ఉత్సాహం..
సిరిసిల్ల సభలో సీఎం కేసీఆర్‌ ఉత్సాహంగా స్థానిక నేతలతో ముచ్చటిస్తూ నమస్కరిస్తూ ముందుకు సాగారు. సభకు భారీగా జనం రావడంతో ఆ పార్టీ శ్రేణులు సభా విశేషాలను బుధవారం చర్చించుకోవడం కనిపించింది. సీఎం కేసీఆర్‌ జిల్లా నాయకులను పేరుపెట్టి పిలుస్తూ పలకరించడాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు ఉటంకించారు. మొత్తంగా సిరిసిల్లలో సీఎం సభ సక్సెస్‌ కావడంతో రెట్టింపు ఉత్సాహంతో గులాబీ శ్రేణులు ప్రచార పర్వంలో బీజీ అయ్యారు.  

మరిన్ని వార్తలు