మూగజీవాలను కాటేస్తున్న లెడ్

7 Jan, 2015 04:54 IST|Sakshi
మూగజీవాలను కాటేస్తున్న లెడ్

కొందుర్గు: పరిశ్రమల నుంచి విచ్చల విడిగా బయటకు వెలువడుతున్న లెడ్ మూగజీవాలను కాటేస్తోంది. సమీపంలోని పచ్చికను తిని నీళ్లు తాగిన పశువులు మృ త్యువాతపడుతున్నాయి. ఈ క్రమం లో ఈనెల 1వ తేదీన సమీప పొలాల రైతులకు చెందిన ఏడు పశువులు మృతి చెం దాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అ నుమతులు లేకున్నా మండలంలోని జి ల్లేడ్ గ్రామశివారులో ఓ పరిశ్రమ కొనసాగుతోంది. ఇక్కడ కర్బన పదార్థాలను మరిగించి లెడ్‌ను తయారుచేస్తున్నారు.

పరిశ్రమ సమీపంలోని పొలాల్లో మేత మే యడంతో ఎల్కగూడాలో గతంలోనే ఏడు పశువులు మృతిచెందాయి. గుట్టుచప్పు డు కాకుండా జిల్లేడ్‌లో చెట్లపొదల మా టున లెడ్ తయారీకి మరో పరిశ్రమను నడుపుతున్నారు. ఈ పరిశ్రమ ఉదయం 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది.   
 
లెడ్ తయారీ ఇలా..
వాహనాల్లోని కాలిపోయిన బ్యాటరీల్లో ఉండే వ్యర్థపదార్థం, రాక్‌పౌడర్, బొగ్గు, ఇనుమును బాగా మరిగించి లెడ్‌ను తయారుచేస్తున్నారు. దీన్ని రాత్రికిరాత్రే హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పరిశ్రమలోని ఒక్కో బట్టీలో 25కిలోల బరువు ఉన్న మూడు లెడ్ కడ్డీలను తయారుచేస్తారు. ఇక్కడి నుంచి విషరసాయనాలు సమీపంలోని చెరువులు, బోరుబావుల్లోని నీళ్లల్లో ఇంకిపోతున్నాయి.

ఈ నీటిని తాగిన పశువులు చనిపోతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేనప్పటికీ పరిశ్రమ నిర్వహణ కోసం ట్రాన్స్‌కో అధికారులు ఓ సింగిల్‌ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ అమర్చారు. అంతేగాక వ్యవసాయబోరు నుంచి పరిశ్రమకు నీటిని వాడుకుంటున్నారు. ఇటు గ్రామపంచాయతీ, రెవె న్యూ, పరిశ్రమల శాఖ, అటు కాలుష్యం నియంత్రణ మండలి అధికారులు ప ట్టించుకోకపోవడంతో విచ్చలవిడిగా కా లుష్యం వెదజల్లుతూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. యజమానిపై చర్యలు తీసుకుని పరిశ్రమను సీజ్‌చేయాలని సమీప పొలాల రైతులు కోరుతున్నారు.
 
మిల్లులో నమూనాల సేకరణ
పర్యావరణ ఇంజనీర్ శ్రీలక్ష్మి నేతృత్వంలోని అధికారుల బృందం గద్వాల మండలం వీరాపురం స్టేజీ వద్ద ఉన్న మిల్లులను పరిశీలించింది. అక్కడి నుంచి నేరుగా కొండపల్లి క్రాస్‌రోడ్డులో ఉన్న రమ్య జిన్నింగ్ మిల్లుకు చేరుకున్నారు. ఫ్యాక్టరీలోకి వెళ్లిన అధికారుల బృందం జిన్నింగ్ మిల్లులో డీలింటింగ్ ప్రాసెస్ యూనిట్ల వద్దకు చేరుకొని అక్కడి నీటిలో నమూనాలు సేకరించారు.

ఇదే సమయంలో ఫ్యాక్టరీలోకి మునిసిపల్ చైర్‌పర్సన్ బృందం వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంగా గొడవ ప్రారంభం కావడంతో అధికారులు ఫ్యాక్టరీ ముందుకు వచ్చేశారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న డీలింటింగ్‌కు సంబంధించిన నమూనాలపై నివేదికలు సిద్ధంచేశారు. సంతకాల కోసం మిల్లు యజమానిని పిలిచినా రాకపోవడంతో అధికారులు ఉన్నతాధికారులకు వాస్తవాలను నివేదిస్తామంటూ వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు