జీఎస్టీ కౌన్సిల్‌కు నిరసనల సెగ

10 Sep, 2017 02:27 IST|Sakshi
జీఎస్టీ కౌన్సిల్‌కు నిరసనల సెగ

► పలు రాష్ట్రాలకు చెందిన కార్మికుల ఆందోళన
►జీఎస్టీని ఎత్తివేయాలని నిరసన
►మాదాపూర్‌లో పరిస్థితి ఉద్రిక్తం
►నిరసనకు వామపక్షాల మద్దతు.. సీపీఐ నేత నారాయణ అరెస్ట్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరు గుతున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలకు నిరసన సెగ తగిలింది. జీఎస్టీ తమ బతుకులను ఛిద్రం చేస్తోం దని పలు రాష్ట్రాలకు చెందిన చేనేత, బీడీ, జౌళి కార్మికులు ఆందోళనకు దిగారు. వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. దీంతో సమావేశాలు నిర్వహిస్తున్న హెచ్‌ఐసీసీ రోడ్డులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

రంగంలోకి దిగిన సైబరాబాద్‌ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి నిరసనకారులను అరెస్ట్‌ చేశారు. నిరసన కారులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులా టలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కిందపడిపోయారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహా రాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 200 మందికి పైగా కార్మికులను అరెస్ట్‌ చేసి రాయ దుర్గం, గచ్చిబౌలి, నార్సింగి, మియాపూర్, ఆర్సీపురం పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

కేంద్రానికి తెలుగు రాష్ట్రాల వత్తాసు..
‘జీఎస్టీని వ్యతిరేకించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వత్తాసు పలుకుతు న్నాయి. జీఎస్టీ నుంచి రైతులను, చేనేత కార్మికులను మినహాయించకపోతే దేశంలో వారి ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. పెద్ద పెద్ద కార్ల కంపెనీలకు జీఎస్టీలో రాయితీలు ఇవ్వడం సమంజసం కాదు. వంద రూపాయల వస్తువును ఉత్పత్తి చేస్తే దానిపై రూ.18 నుంచి రూ.22కు పెంచి విక్రయించాలంటే సాధ్యపడదు. చేతి వృత్తి కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి.
                                                                     –సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

మాల్స్‌ మమ్మల్ని దెబ్బతీశాయి..
మేము ఉత్పత్తి చేసిన దుస్తులు తక్కువ ధరకు కొని షాపింగ్‌ మాల్స్‌లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మార్కెట్‌ కల్పించకపోవడంతో నష్టాల బారిన పడుతున్నాం. స్థాని కంగా మార్కెట్‌ అవకాశాలు లేకపోవడాన్ని షాపింగ్‌ మాల్స్‌ అనుకూలం గా మలుచుకుంటున్నాయి. పెద్ద షాపింగ్‌ మాల్స్‌కు రాయితీలు ఇచ్చి, చేతి వృత్తి కార్మికులు కొనుగోలు చేసే ముడి సరుకులకు రాయితీలు ఇవ్వడం లేదు. చేతి వృత్తి కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి’.     
                                                         – టి.వెంకటరాములు,
                                    తెలంగాణ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి

 

>
మరిన్ని వార్తలు