కందుల కొనుగోలు కేంద్రాలు మూత

24 Feb, 2018 17:37 IST|Sakshi
భువనగిరి మార్కెట్‌యార్డ్‌ గేటుకు అతికించిన ఫ్లెక్సీ

భువనగిరి/ఆలేరు : జిల్లాలో  హాకా సంస్థ ఆ« ద్వర్యంలో ఏర్పాటు చేసి న రెండు కందుల కొనుగోలు  కేంద్రాలను శని వారం నుంచి మూసివేయనున్నారు.  ఇప్పటికే అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద  కేంద్రాలను మూసివేస్తున్నట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

జిల్లాలో రెండు కేంద్రాలు మూసివేత
జిల్లాలో కందులను కొనుగోలు చేసేందుకు హాకా సంస్థ ఆధ్వర్యంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆలేరులో జనవరి 17, భువనగిరిలో 18వ తేదీన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆలేరులో ఇప్పటి వరకు 2,106మంది రైతుల నుంచి 19,844క్వింటాళ్ల కందులను కొనుగోలు చేయగా భువనగిరిలో 2,557రైతుల నుంచి 20,927క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు భువనగిరిలో 374మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 3,110క్వింటాళ్లకుగాను రూ.1.69 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాగా ఇంకా రూ.10కోట్లు రావాల్సి ఉంది. ఆలేరులో 400మంది రైతులకు సంబంధించిన 1,411క్వింటాళ్లకుగాను జనవరి 30నాటికి రూ.85లక్షలను రైతుల ఖాతాల్లో వేశారు.

కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నాం
జిల్లా మార్కెట్‌ శాఖ అధికారి ఆదేశాల మేరకు శనివారం నుంచి కందుల కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నాం. రైతులు ఈవిషయాన్ని గమనించి రైతులు గమనించి సహకరించాలని కోరుతున్నాం.– వేణుగోపాల్‌రెడ్డి, మార్కెట్‌ కార్యదర్శి,భువనగరి
 

మరిన్ని వార్తలు