‘వెట్టిచాకిరీ చేస్తున్న షాపింగ్‌మాల్స్‌ కార్మికులు’ 

30 Mar, 2018 09:33 IST|Sakshi

సిరిసిల్లటౌన్‌: జిల్లాలోని షాపింగ్‌ మాల్స్‌లో పని చేస్తున్న కార్మికులు ఏళ్ల తరబడిగా వెట్టిచాకిరీ చే స్తున్నారని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మూ షం రమేశ్‌ అన్నారు. యూనియన్‌ కార్యాలయంలో గురువారం జరిగిన కార్మికుల సమావేశంలో మాట్లాడారు. ఒక్కో కార్మికునితో యజమాన్యాలు 8 గంటలకు మించి పనిచేయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేలలోపే వేతనాలు చెల్లిస్తూ.. కనీ స వేతన చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని తెలి పారు. కార్మికులకు అధికారులు కనీస వేతనాలు అమలు చేయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మోర అజయ్, అన్నల్‌దాస్‌ గణేశ్, ఒగ్గు గణేశ్, నక్క దేవదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు