పది లక్షల కోసం ప్రాణం తీశారు

12 Feb, 2016 02:38 IST|Sakshi
పది లక్షల కోసం ప్రాణం తీశారు

  హత్య కేసును ఛేదించిన పోలీసులు
ఇద్దరు నిందితుల అరెస్టు
మరో ముగ్గురి కోసం గాలింపు

 
  ధర్మపురి :  ధర్మపురి శివారులోని రామయ్యపల్లెలో గత నెల 25న జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. రూ.10 లక్షల కోసం ఇద్దరు వ్యక్తులు సుల్తానాబాద్‌కు చెందిన పాలాజి రామయ్య(59)ను కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అనుమానం రాకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసినట్లు నిర్ధారించారు. నిందితులు గర్రెపెల్లి శ్రీనివాస్, పరశురాములును ధర్మపురి సీఐ వెంకటరమణ గురువారం అరెస్ట్ చూపారు. ఆయన కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌కు చెందిన రామయ్య గ్రామంలో వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతడికి రాజీవ్ రహదారిని అనుకుని ఉన్న స్థలాన్ని పెట్రోల్ బంక్ కోసం గర్రెపెల్లి శ్రీనివాస్‌కు లీజుకు ఇచ్చాడు. సుమారు రూ.10 లక్షల లీజు డబ్బులు బకాయి పడడంతో ఈ విషయమై రామయ్య, శ్రీనివాస్‌కు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ రూ.10 లక్షల చెక్కును రామయ్యకు ఇచ్చాడు. అది బౌన్‌‌స కావడంతో మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో విసుగు చెందిన శ్రీనివాస్ రామయ్యను హత్య చేయాలని పథకం పన్నాడు.


ఈ మేరకు ఇద్దరు కిరాయి రౌడీలను మాట్లాడి వారికి రూ.25 వేల చొప్పున రూ.50 వేలు ముట్టజెప్పాడు. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బులు తీసుకున్నవారు హత్య చేయకపోగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాస్ రంగంలోకి దిగాడు. గత నెల 25న డబ్బులు ఇస్తానని రామయ్యకు చెప్పాడు. అదే రోజు కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన పరశురాములుతో కారులో ఇంటికి వచ్చి రామయ్యను తీసుకెళ్లాడు. కారు కరీంనగర్ శివారుకు రాగానే పరశురామ్ రామయ్యకు క్లోరోఫాం ఉన్న చేతిరుమాలు వాసనచూపడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం స్థానిక చల్మెడ ఆనందరావు ఆస్పత్రి సమీపంలో పరశురాములు వెంటతెచ్చుకున్న కత్తితో రామయ్య గొంతుకోశాడు. మృతదేహాన్ని ధర్మపురి శివారులోని రామయ్యపల్లెకు తీసుకెళ్లి ముళ్లపొదల్లో పడేసి పెట్రోల్‌పోసి దహనం చేశారు. 29వ తేదీన గుర్తించి గుర్తుతెలియని వ్యక్తి హత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గూడెంగుట్ట వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనివాస్, పరశురాములును అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా రామయ్యను హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. రామయ్యను హత్యచేసేందుకు డబ్బులు తీసుకున్న అనిల్, సమ్మయ, అమర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

     హత్య కేసును ఛేదించిన పోలీసులు
     ఇద్దరు నిందితుల అరెస్టు
     మరో ముగ్గురి కోసం గాలింపు
 
 
 ధర్మపురి :
 ధర్మపురి శివారులోని రామయ్యపల్లెలో గత నెల 25న జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. రూ.10 లక్షల కోసం ఇద్దరు వ్యక్తులు సుల్తానాబాద్‌కు చెందిన పాలాజి రామయ్య(59)ను కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అనుమానం రాకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసినట్లు నిర్ధారించారు. నిందితులు గర్రెపెల్లి శ్రీనివాస్, పరశురాములును ధర్మపురి సీఐ వెంకటరమణ గురువారం అరెస్ట్ చూపారు. ఆయన కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌కు చెందిన రామయ్య గ్రామంలో వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతడికి రాజీవ్ రహదారిని అనుకుని ఉన్న స్థలాన్ని పెట్రోల్ బంక్ కోసం గర్రెపెల్లి శ్రీనివాస్‌కు లీజుకు ఇచ్చాడు. సుమారు రూ.10 లక్షల లీజు డబ్బులు బకాయి పడడంతో ఈ విషయమై రామయ్య, శ్రీనివాస్‌కు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ రూ.10 లక్షల చెక్కును రామయ్యకు ఇచ్చాడు. అది బౌన్‌‌స కావడంతో మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో విసుగు చెందిన శ్రీనివాస్ రామయ్యను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ మేరకు ఇద్దరు కిరాయి రౌడీలను మాట్లాడి వారికి రూ.25 వేల చొప్పున రూ.50 వేలు ముట్టజెప్పాడు. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బులు తీసుకున్నవారు హత్య చేయకపోగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాస్ రంగంలోకి దిగాడు. గత నెల 25న డబ్బులు ఇస్తానని రామయ్యకు చెప్పాడు. అదే రోజు కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన పరశురాములుతో కారులో ఇంటికి వచ్చి రామయ్యను తీసుకెళ్లాడు. కారు కరీంనగర్ శివారుకు రాగానే పరశురామ్ రామయ్యకు క్లోరోఫాం ఉన్న చేతిరుమాలు వాసనచూపడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం స్థానిక చల్మెడ ఆనందరావు ఆస్పత్రి సమీపంలో పరశురాములు వెంటతెచ్చుకున్న కత్తితో రామయ్య గొంతుకోశాడు. మృతదేహాన్ని ధర్మపురి శివారులోని రామయ్యపల్లెకు తీసుకెళ్లి ముళ్లపొదల్లో పడేసి పెట్రోల్‌పోసి దహనం చేశారు. 29వ తేదీన గుర్తించి గుర్తుతెలియని వ్యక్తి హత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గూడెంగుట్ట వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనివాస్, పరశురాములును అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా రామయ్యను హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. రామయ్యను హత్యచేసేందుకు డబ్బులు తీసుకున్న అనిల్, సమ్మయ, అమర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు