మా ఊళ్లో మద్యం వద్దు !

24 Jul, 2019 09:00 IST|Sakshi
మాధ్వార్‌ వ్యూ..

సంపూర్ణ మద్య నిషేధం కోసం మాధ్వార్‌ గ్రామస్తుల తీర్మానం

మద్యం విక్రయిస్తే రూ.40 వేల జరిమానా

మరికల్‌ (నారాయణపేట): గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు మండలంలోని మాధ్వార్‌ గ్రామస్తులు అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మంగళవారం గ్రామస్తులు తిర్మానం చేశారు. మద్య నిషేధ సమయంలో గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మకాలు చేపడితే రూ.40వేల జరిమానా విధిస్తామని సర్పంచ్‌ పుణ్యశీల తిర్మానించారు.

 మహిళా సర్పంచ్‌ ముందడుగు..
మరికల్‌ మండలం మాధ్వార్‌లో 845 కుటుంబాలు ఉండగా 3,568 మంది జనాబా ఉంది. ఇటీవల కాలంలో గ్రామంలో మద్యం సేవించి భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్న యువతను మార్చేందుకు మాహిళ సర్పంచ్‌ పుణ్యశీల ముందుగా నడుం బిగించారు. ఆమె పిలుపు అందుకున్న మిగితా ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు, మహిళలు పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం సర్పంచ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు తిర్మానించారు. ఇందుకు గ్రామస్తులు సైతం ముందుకు వచ్చి తమ సంసారాలు బాగుపడుతాయంటే ఇంతకంటే ఏం కావాలంటూ పంచాయతీ కార్యాలయం ఎదుట మద్యం నిషేదిస్తున్నట్లు ప్రతిజ్ఞా చేశారు. ఆగష్టు 15 తర్వాత మాధ్వార్‌లో ఎవరైన మద్యం అమ్మకాలు చేప్పడితే రూ. 40 వేలు జరిమాన విధిస్తామని తిర్మానం చేశారు. అంతలో ఏమైన మద్యం మిగిలివుంటే ఆగస్టు 14 వరకు విక్రయించుకోవాలని వారికి వెసులుబాటు కల్పించి మిగితా గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. 

యువత పెడదారి పట్టొద్దనే నిర్ణయం
యువత పెడదారి పట్టకుండా ఉండేందుకే గ్రామంలో మద్యం నిషేదించడం జరిగింది. ఇటీవల కాలంలో గ్రామంలో యువకులతో పాటు మహిళలు కూడా మద్యం సేవించి అలర్లకు కారణమవుతున్నారు. మాధ్వార్‌ గ్రామాన్ని ఒక ప్రశాంతమైన గ్రామంగా తీర్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది.  – పుణ్యశీల, సర్పంచ్, మాధ్వార్‌ 

మరిన్ని వార్తలు