కష్టకాలంలో పెద్ద మనసు

31 Mar, 2020 02:56 IST|Sakshi

ముఖ్యమంత్రి సహాయ నిధి విరాళాల వెల్లువ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపయోగపడేందుకు వీలుగా పలు సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి. దీనికి సంబంధించిన చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్‌కు అందించారు.
► హెటెరో డ్రగ్స్‌ రూ.5 కోట్ల విరాళం అందించింది. దీంతోపాటు రూ.5 కోట్ల విలువైన మందులను (హైడ్రాక్సి క్లోనోక్విన్, రిటోనవిర్, లోపినవిర్, ఒసెల్టమివిర్‌) కూడా ప్రభుత్వానికి అందించారు. చెక్కును ముఖ్యమంత్రికి, మందులను వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు హెటెరో చైర్మన్‌ పార్థసారథి రెడ్డి, డైరెక్టర్‌ రత్నాకర్‌ రెడ్డి అందించారు. 
► తెలంగాణ మోటార్‌ వెహికల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అసోసియేషన్‌ రూ.1.5 కోట్ల విరాళం అందిం చారు. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్‌ అధ్య క్షుడు కె.పాపారావు తదితరులు సీఎం కేసీఆర్‌కు అందించారు. 
► సువెన్‌ ఫార్మా రూ.కోటి విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సువెన్‌ ఫార్మా చైర్మన్‌ వెంకట్‌ జాస్తి ముఖ్యమంత్రికి అందించారు.
► రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు ఒక రోజు వేతనం సుమారు రూ.12 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. ఉద్యోగుల తరఫున తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ సోమవారం విద్యుత్‌ సౌధలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును కలిసి ఈ మేరకు లేఖను అందజేశారు. 
► ఎన్‌సీసీ లిమిటెడ్‌ రూ.కోటి విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ ఎ.రంగరాజు ముఖ్యమంత్రికి అందించారు.
► శ్రీ చైతన్య విద్యాసంస్థలు రూ.కోటి విరాళం అందించాయి. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ డైరెక్టర్‌ వై.శ్రీధర్‌ ముఖ్యమంత్రికి అందించారు.
► తెలంగాణ రైస్‌ మిల్స్‌ అసోసియేషన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్‌ నాయకులు నాగేందర్, మోహన్‌ రెడ్డి తదితరులు సీఎంకు అందించారు.
► జేఎన్‌టీయూ బోధన, బోధనేతర, కాంట్రాక్టు సిబ్బంది, పెన్షనర్లు ఒకరోజు మూల వేతనం సుమారు రూ.12 లక్షలు సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళంగా అందజేయనున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎ.గోవర్ధన్‌ తెలిపారు.

మంత్రి కేటీఆర్‌కు పలువురు అందజేసిన విరాళాల వివరాలివీ
► వాల్యూ ల్యాబ్స్‌ సంస్థ    రూ.5.25 కోట్లు
► జీవీపీఆర్‌ ఇంజనీర్స్‌ సంస్థ    రూ.కోటి
► అమర్‌రాజా బ్యాటరీస్‌    రూ.కోటి
► ఐసీఎఫ్‌ఏఐ సొసైటీ    రూ.కోటి
► వంశీ రామ్‌ బిల్డర్స్‌    రూ.కోటి
► సిగ్నిటి టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌    రూ.50లక్షలు
► యునైటెడ్‌ స్టేట్స్‌ ఫార్మా కోపియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌    రూ.50 లక్షలు
► భాష్యం ఎడ్యుకేషనల్‌ సొసైటీ    రూ.25 లక్షలు
► విమల ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌    రూ.25 లక్షలు
► ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌    రూ.25 లక్షలు 
► స్వస్తిక్‌ మిర్చ్‌ స్టోర్‌    రూ.21 లక్షలు
► గురునానక్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ    రూ.11 లక్షలు 
► బీహెచ్‌ఆర్‌ డెవలపర్స్‌    రూ.10 లక్షలు
► సీఎస్‌కే రియల్టర్స్‌ లిమిటెడ్‌    రూ.10 లక్షలు
► సాయిసూర్య డెవలపర్స్‌    రూ.10 లక్షలు
► నార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(నాటా)    రూ.10 లక్షలు
► సీ5 ఇన్‌ఫ్రా లిమిటెడ్‌    రూ.10 లక్షలు
► జగత్‌ స్వల్ప రియల్టర్స్‌    రూ.10 లక్షలు
► శ్రీసాయి రూరల్‌ ఫ్లోర్‌ మిల్‌    రూ.10 లక్షలు
► చల్లా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌    రూ.10 లక్షలు
► హైదరాబాద్‌ బోట్స్‌ క్లబ్‌ తరఫున రూ.10 లక్షలను సంస్థ అధ్యక్షుడు చెన్నాడి సుధాకర్‌ రావు అందించారు    
► తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం రూ.10 లక్షలు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి రూ.10 లక్షలు ఇచ్చారు.
► సీఎస్కే రియల్టర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌ స్కూల్‌ చెరో రూ.5 లక్షలు
► జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌(సీబీఎస్‌ఈ) చైర్మన్‌ సురేశ్‌ కుమార్‌ రూ.5 లక్షలు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా