వందశాతం అక్షరాస్యత సాధించాలి

12 May, 2015 22:06 IST|Sakshi

రంగారెడ్డి: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సాక్షర భారత్ గ్రామ కో ఆర్డినేటర్ల సేవలను వినియోగించుకోవాలని వయోజన విద్యా డిప్యూటీ డెరైక్టర్ కిషన్‌నాయక్ సూచించారు. మర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో వంద శాతం అక్షరాస్యత సాధించే విధంగా పాటు పడాలన్నారు.

గ్రామాల్లో సక్రమంగా విధులు నిర్వహించని గ్రామ కో ఆర్డినేటర్లను తొలగించే పూర్తి బాధ్యత సాక్షర భారత గ్రామ కమిటీదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలలో గ్రామ కో ఆర్డినేటర్లు చురుగ్గా పాల్గొంటున్నారని, వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు వారితో కలిసి సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ కో ఆర్డినేటర్లకు శిక్షణ కార్యక్రమాలు, ప్రభుత్వం నుంచి విడుదల చేసే సామగ్రిని ఎప్పటికప్పుడు అందేలా తమవంతు కృషి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు