గిరిజనేతరుల రుణమాఫీకి వంద కోట్లు: సీఎం

11 Nov, 2014 02:08 IST|Sakshi
గిరిజనేతరుల రుణమాఫీకి వంద కోట్లు: సీఎం

సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్  జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఉండే గిరిజనేతరులకు రుణమాఫీ వర్తింప చేస్తామని, అందుకోసం  రూ. 100 కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీయిచ్చారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య అడిగిన ప్రశ్నకు సీఎం ఈ హామీ ఇచ్చారు. బంగారం రుణాలకు గాను ప్రభుత్వం డబ్బు చెల్లించినా బ్యాంకులు ఆ బంగారాన్ని ఆడపడుచులకు ఇవ్వడంలేదని రేవంత్‌రెడ్డి (టీడీపీ) చెప్పగా, విడిపించే ప్రయత్నం చేస్తామని కేసీఆర్ బదులిచ్చారు. సమావేశాలు ముగిసేలోగా కరవు మండలాలను ప్రకటిస్తామన్నారు.

మరిన్ని వార్తలు