రైల్వే పోలీసులపై రాళ్లదాడి

24 Jul, 2014 13:14 IST|Sakshi

మెదక్ జిల్లాలో ప్రమాదం సంభవించిన స్థలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి విద్యార్థుల మృతదేహాలను తరలిస్తున్న రైల్వే పోలీసుల వద్ద స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టడానికి లాఠీ ఛార్జి చేయడంతో వెంటనే వాళ్లు రాళ్ల దాడి ప్రారంభించారు.

ఈ రాళ్లు తగిలి రైల్వే అధికారులతో పాటు అక్కడున్న డీఎస్పీకి, కొంతమంది పోలీసులకు, ప్రమాద ఘటనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రమాదాలను అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోలేదన్న ఆగ్రహంతోనే స్థానికులు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. అయితే, ఇలాంటి సున్నితమైన సమయంలో లాఠీ ఛార్జి జరగడంతో మరింత ఆవేశానికి గురై రాళ్లతో దాడి చేశారని అంటున్నారు.

మరిన్ని వార్తలు