లాక్‌డౌన్‌: పోలీసులకు చల్లని మజ్జిగ అందించిన ఐటీ ఉద్యోగి

7 Apr, 2020 16:00 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా  లాక్‌డౌన్‌ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు లాక్‌డౌన్‌కు అందరూ సహకరించేలా పగలు రాత్రి తేడా లేకుండా పోలీసులు సేవలు అందిస్తున్నారు. ఈ మహమ్మారి బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు పోలీసులు ఎవరూ రోడ్లపైకి రాకుండా సామాజిక దూరం పాటించేలా సేవలందిస్తున్నారు. క్రమంలో వారు ఎండను సైతం లెక్క చేయడం లేదు. ఇలా కరోనాతో యుద్ధంలో సైనికుల పాత్ర పోషిస్తున్న రక్షక భటులకు మద్దతునిచ్చేందుకు ఖమ్మంకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ముందుకు వచ్చారు. రక్షక భటులకు చల్లని మజ్జిగ పానియం పంపిణీ చేసి వారి దాహన్ని తిరుస్తున్నాడు.

ఇక లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో,  రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎదుటివారికి సాయం చేయడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఇందుకోసం ఎవరికి తోచిన విధంగా వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ భరోసా అందిస్తున్నారు. (కరోనా ఎఫెక్ట్ : రూ. 5 లక్షల కోట్లకు)

మరిన్ని వార్తలు