చితికిపోతున్న టమాటా రైతు

4 May, 2020 09:27 IST|Sakshi
పేరూర్‌ సరస్వతీ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన పారబోసిన టమాటాలు

సాక్షి, పాపన్నపేట(మెదక్‌): కనికరం లేని కరోనా ఏవర్గాన్ని వదిలి పెట్టడడం లేదు. లాక్‌డౌన్‌ అన్ని వర్గాలకు బేడీలు వేసింది. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతుంటే ..కూర గాయల ధరలు పాతాళానికి పడి పోతున్నాయి. అంగళ్లపై నిషేధం ఉండటంతో ..కూరగాయల రైతులు ఎక్కడో ఒక చోట వీధి మూలన బిక్కు బిక్కుమంటూ అరగంట పాటు అమ్ముకొని ఎవరి కంట పడకుండా ఇంటి బాట పడుతున్నారు. ఈ పద్ధతి  వారి అవసరానికే అమ్ముకుంటున్నట్లు ఉండటంతో ..ధరలు అమాంతం పడిపోయాయి. ముఖ్యంగా టమాటా రైతు చితికి పోతున్నాడు. రూ.10కి మూడు కిలోల చొప్పున అమ్ముకుంటున్నాడు.  ఒక్కో సారి అవి కూడా అమ్మక పోవడంతో

జిల్లాలో యాసంగి పంటగా సుమారు 750 ఎకరాల టమాటా పంట వేశారు. 7500 టన్నుల పంట దిగుబడి వస్తోంది. ఇతర కూరగాయలు 3500 ఎకరాల్లో వేసినట్లు హారి్టకల్చర్‌ అధికారులు తెలిపారు. సాధారణంగా వేసవి కాలంలో నీటి లభ్యత మోస్తారుగా ఉన్న చోట కూరగాయల పంటలకు ప్రాధాన్యత  ఇస్తారు. యేటా మే నెల నాటికి ఎండల ప్రభావం పెరగడంతో, సాధారణంగా కూరగాయల ధరలు కూడా పెరుగుతుతాయి. కానీ ఈ సారి కరోనా..లాక్‌డౌన్‌  ప్రభావాలతో  ధరలు పతనమయ్యాయి. 

రైతు కంట కన్నీళ్లు..
కరోనా కల్లోలం కూరగాయల రైతుల బతుకులను ఆగం చేసింది. విత్తు విత్తి..కలుపు తీసి..పురుగు మందులు చల్లి పండించిన కూరగాయలు రైతు కలలను కల్లలు చేశాయి. అంగళ్లు మూతబడ్డాయి. హాస్టళ్ళు, హోటళ్లు, మెస్‌లు బంద్‌ అయ్యాయి. దీంతో కూరగాయల వ్యాపారులు ఇళ్లిల్లు తిరుగుతూ అమ్ముతున్నారు. ఇంటికి వచి్చన వ్యాపారి ఎంతో కొంతకు ఇవ్వక మానడు అన్న తలంపుతో తక్కువ ధరలకే  వినియోగదారులు  కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంగళ్లకు వచ్చే వ్యాపారులు చాటు మాటుకు దుకాణాలు పెట్టుకొని ఏదో కొంత ధరకు అమ్ముకొని పరుగులు  తీస్తున్నారు. టమాటా రైతు పరిస్థితి మరీ దీనంగా ఉంది. రూ.10కి మూడు కిలోల టమాటా అమ్ముకుంటున్నారు. ఒక్కో సారి ధరలేక రూ.2 కు కిలో ఇస్తున్నట్లు చెపుతున్నారు. కొన్ని పరిస్థితుల్లో అసలు కొనే వారే లేకపోవడంతో దారి పక్కనే పారేసి కన్నీళ్లతో వెళ్తున్నారు. ధర గిట్టుబాటు కాకపోవడంతో టమాటా తెంపకుండా పొలంలోనే వదిలి వేస్తున్నారు. బీరకాయలు కిలో రూ.20, బెండకాయలు రూ.30, వంకాయలు రూ.30, గోపి గడ్డ రూ. 10, కాలి ఫ్లవర్‌ రూ.20 కి లో చొప్పున అమ్ముతున్నారు. 

మరిన్ని వార్తలు