స్వచ్ఛందంగా లాక్‌డౌన్

14 Jun, 2020 02:46 IST|Sakshi
కామారెడ్డి జిల్లా భిక్కనూరులో నిర్మానుష్యంగా ఉన్న మార్కెట్‌ కూడలి

కరోనా కట్టడికి భిక్కనూరు గ్రామస్తుల నిర్ణయం

మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు

ఉల్లంఘిస్తే రూ. ఐదు వేల జరిమానా విధించాలని తీర్మానం

భిక్కనూరు: కోవిడ్‌-19 నుంచి కాపాడుకు నేందుకు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం ఉదయం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వ్యాపారులు, పుర ప్రముఖులు, పోలీసులు సమావేశమై కరోనా కట్టడిపై చర్చించారు. రోజంతా వ్యాపారాలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకోవడమే ఉత్తమమని నిర్ణయించారు. పట్టణంలోని వ్యాపార కేంద్రమైన గాంధీచౌక్‌ ప్రాంతంలోని కిరాణ దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, గల్లీల్లోని చిన్న కిరాణ దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరచి ఉంచాలని నిర్ణయించారు.

మెడికల్‌ షాపులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, చికెన్, మటన్‌ దుకాణాలు ఉదయం, సెలూన్‌లు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. ప్లాస్టిక్, పేపర్‌ గ్లాసులు రోడ్లపై వేస్తే రూ.3 వేల జరిమానా విధించాలని తీర్మా నించారు. పంచాయతీ నిర్ణయాలను ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా విధిం చాలని, దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌ ధరించిన వారికే సరుకులు విక్రయించాలని నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు