ఓడినా నైతిక విజయం నాదే: కొండా

25 May, 2019 02:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చేవెళ్ల నుంచి ఎంపీగా ఓడినా నైతిక విజయం తనదేనని కాంగ్రెస్‌ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో చివరి వరకు గెలుపు కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపినప్పటికీ, పట్టణ ఓటర్లను ప్రత్యర్థులు కొనుగోలు చేయడంతో తాను ఓడిపోయానని వివరించారు. శక్రవారం ఆయన గాంధీభవన్‌లో ఎమ్మెల్యే పైల ట్‌ రోహిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పోలీసులు, అధికారులను తన స్వలాభం కోసం వాడుకుందని, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి నానా ఇబ్బందుల కు గురిచేసిందని ఆరోపించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌ నేతలని లక్ష్యంగా చేసుకున్నారని, సమావేశాలకు అనుమతులివ్వకుండా అడ్డుకున్నారన్నారు. రాజకీయంగా తనను పూర్తిగా అణగదొక్కేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నించిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాం గ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకుందని, నేతలు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు.

మరిన్ని వార్తలు