హమ్మయ్య

2 Aug, 2019 11:53 IST|Sakshi

తగ్గిన ఎల్పీజీ సిలిండర్‌ ధర  

సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ సిలిండర్‌ ధర తగ్గింది. 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.690 నుంచి రూ.627.50కి తగ్గింది. అంటే సిలిండర్‌పై రూ.62.50 తగ్గినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్పీజీ గ్యాస్‌ ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం బలపడడం తదితర కారణాలతో చమురు సంస్థలు ఈ మేరకు  నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తగ్గిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. వినియోగదారులు సిలిండర్‌ కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీ సొమ్ము నగదు బదిలీ కింద బ్యాంక్‌ అకౌంట్‌లో పడుతుంది. మూడు నెలలుగా ఎల్పీజీ సిలిండర్‌ ధర తగ్గుతూ వస్తోంది.  జూన్‌లో రూ.793 ఉండగా జూలైలో రూ.690కు చేరింది. తాజాగా మరో రూ.62.50 తగ్గింది.  గ్రేటర్‌ పరిధిలో డొమెస్టిక్‌ కనెక్షన్లు 26.21 లక్షల వరకు ఉండగా... 135 ఎల్పీజీ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతిరోజు 1.50 లక్షల వరకు డొమెస్టిక్‌ సిలిండర్ల సరఫరా జరుగుతోంది.

మరిన్ని వార్తలు