మేమిస్తామంటే మీరొద్దంటారా!

23 Apr, 2019 07:54 IST|Sakshi

ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు తీసుకోని అధికారులు  

ఫీజులు చెల్లించాలని ఇప్పటికే ఎస్సెమ్మెస్‌లు  

హెచ్‌ఎండీఏ చుట్టూ దరఖాస్తుదారుల చక్కర్లు  

నిరీక్షణలో 15వేల మంది  

అక్టోబర్‌లోనే ముగిసిన క్లియరెన్స్‌ ప్రక్రియ  

ప్రభుత్వం అనుమతిస్తేనే తీసుకుంటామంటున్న సిబ్బంది  

అవకాశమిస్తే హెచ్‌ఎండీఏకు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల ఆదాయం

ఘట్‌కేసర్‌ మండలం అన్నోజిగూడ గ్రామానికి చెందిన విక్రమ్‌ తన 180 గజాల ప్లాట్‌ క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని పత్రాలను సరిచూసిన హెచ్‌ఎండీఏ సిబ్బంది ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించాలని విక్రమ్‌కు అక్టోబర్‌ నెలాఖరులో సంక్షిప్త సమాచారం పంపించారు. అయితే అప్పటికే సమయం మించిపోవడం, అక్టోబర్‌ 31 అర్ధరాత్రి నుంచి ఆన్‌లైన్‌ చెల్లింపులు నిలిపివేయడంతో ఫీజు చెల్లించలేదు.  

శంకర్‌పల్లికి చెందిన అరుణ్‌రెడ్డి తన 150 గజాల ప్లాట్‌ క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని పత్రాలు సరిచూసిన అధికారులు ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించాలని ఎస్సెమ్మెస్‌ పంపించారు. అక్టోబర్‌లోనే ఆ ఫీజు చెల్లించాల్సి ఉండగా చెల్లించలేకపోయాడు. ఆ మొత్తం చెల్లిద్దామని హెచ్‌ఎండీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తీసుకోవడం లేదు.  

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కార్యాలయం చుట్టూ ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు చక్కర్లు కొడుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లిస్తామని తార్నాకలోని కేంద్ర కార్యాలయం చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నా అధికారులు తీసుకోవడం లేదు. ప్లాట్‌ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకోగా అన్ని పత్రాలు సరిగానే ఉన్నాయని ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించాలని దరఖాస్తుదారులకు ఎస్సెమ్మెస్‌లు పంపించిన అధికారులు... ఇప్పుడు ఫీజు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. గతంలోనే ఈ ఫీజు చెల్లించాల్సిన  10వేల మందికి తోడు అక్టోబర్‌ నెలాఖరులో ఎస్సెమ్మెస్‌లు అందుకున్న మరో 5వేల మంది దరఖాస్తుదారులు ఆ మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ 15వేల మంది ఫీజు చెల్లిస్తే హెచ్‌ఎండీఏకు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం. అయితే గతేడాది అక్టోబర్‌ 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ ప్రక్రియ ముగియడంతో ఆన్‌లైన్, బ్యాంకు చెల్లింపులను నిలిపేశారు. దీంతో దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు. చెల్లింపులు నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే దరఖాస్తుదారులు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఫీజులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగానికి ఇప్పటికే లేఖ రాశామని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.  

గడువు పొడిగిస్తే మేలు..  
హెచ్‌ఎండీఏ పరిధిలోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2015 నవంబర్‌లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. మళ్లీ 2016 డిసెంబర్‌లో 20శాతం అధిక రుసుంతో మరోసారి అవకాశం ఇచ్చింది. ఇలా పాతవి, కొత్తవి కలిపి 1,75,612కు చేరుకున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ టైటిల్‌ స్క్రూటిని, టెక్నికల్‌ స్క్రూటిని పూర్తయిన తర్వాత సక్రమమని తేలాక క్లియరెన్స్‌ ఇచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ దరఖాస్తుదారులకు ఎస్సెమ్మెస్‌లు పంపించారు. అది చెల్లించగానే ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తారు. ఇలా హెచ్‌ఎండీఏకు లక్షా 75వేలకు పైగా దరఖాస్తులు వస్తే 1,02,500 దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. దాదాపు 9,000 దరఖాస్తులు ఎన్‌వోసీల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 63,500 దరఖాస్తులను ఓపెన్‌ స్పేస్, రిక్రియేషనల్, వాటర్‌ బాడీ, మ్యాన్‌ఫ్యాక్చరింగ్, సెంట్రల్‌ స్క్వేర్, ట్రాన్స్‌పొర్టేషన్, బయో కన్జర్వేషన్, ఫారెస్ట్‌ జోన్, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు, ఓపెన్‌ స్పేస్‌ ఆఫ్‌ లేఅవుట్, నది, వాగు, నాలా బఫర్‌జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు తదితర కారణాలతో తిరస్కరించారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ అయిన ఫీజు సమాచారం అందుకున్న 1,02,500  దరఖాస్తుల్లో దాదాపు 15,000 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు పొడిగిస్తే హెచ్‌ఎండీకు దాదాపు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు రూపంలో రూ.వెయ్యి కోట్లు హెచ్‌ఎండీఏ ఖజానాకు వచ్చిన విషయం విదితమే. అయితే ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అనుమతి రావాలని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. మరోవైపు సొంతిల్లు కట్టుకునేందుకు చేతికి అందివచ్చిన అవకాశం కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారిస్తే దరఖాస్తుదారులకు కష్టాలు తప్పనున్నాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'అటవీ అభివృద్ధికి మీవంతు సహకారం అందించాలి'

‘ఉపాధి నిధుల వినియోగంలో ముందుండాలి’

మున్సిపల్‌ చట్టం ఆమోదానికి గవర్నర్‌ బ్రేక్‌

కొడుకు స్కూల్‌కు వెళ్లడం లేదని..

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఏజెన్సీలో మావోల అలజడి

డబ్బులు ఇవ్వండి... పట్టుకోండి...

పతులా.. సతులా..!

బాల్యం.. వారికి మానని గాయం

సాయానికి వెళ్తే.. ప్రాణం పోయింది

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

బర్డ్స్‌ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు..

కారు గుర్తు నాదే.. కాదు.. నాదే!

వివాహేతర  సంబంధానికి  అడ్డుగా ఉన్నాడని..

ఓలా.. లీజు గోల

పెట్రోల్‌లో నీళ్లు..

ప్రతి కుటుంబానికి రూ.పది లక్షల లబ్ధి

గ్రామాలకు అమెరికా వైద్యం

ఆస్తి కోసం నా కుమారుడు చంపేశాడు

సాయంత్రమూ సాఫ్‌

గన్నీ బ్యాగుల సేకరణకు కొత్త మార్గం

నిధులు మంజూరు చేయండి: ఎమ్మెల్యే

మండలానికో డెయిరీ పార్లర్‌

చింతమడకలో సీఎం సార్‌ మెనూ..

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

సీఎం కేసీఆర్‌ పర్యటన హైలైట్స్‌!

ఉన్నారా.. లేరా? 

‘నందికొండ’కు క్వార్టర్లే అండ..!

ఉద్యోగాలు కోరుతూ వినతిపత్రాలివ్వొద్దు..

పాములకు పాలు పట్టించడం జంతుహింసే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!