ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్‌

2 Mar, 2018 13:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ - ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దులో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పౌరహక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు పూర్తి అయ్యేవరకు మావోయిస్టుల మృతదేహాలను సరైన పద్దతిలో భద్రపరిచేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొంది.

కుటుంబ సభ్యుల సమక్షంలో ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం జరపాలని కోరింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలంది. పౌరహక్కుల సంఘం పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం విచారణకు చేపట్టనున్నట్టు సమాచారం.

కాగా సరిహద్దులోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తడపలగుట్ట- ఛత్తీస్‌గఢ్‌‌లోని పూజారికాంకేడు సరిహద్దుల్లో  శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌తో పాటు మరో నేత మరణించినట్టు పోలీసులు ధృవీకరించారు.

మరిన్ని వార్తలు