కమీషన్ లేనిదే పనిచేయని ఎంపీడీఓ

31 Mar, 2016 03:30 IST|Sakshi
కమీషన్ లేనిదే పనిచేయని ఎంపీడీఓ

అవినీతిని ప్రశ్నిస్తే వేధింపులా.. 
ఎంపీపీ బాసని రమాదేవి

 
శాయంపేట : గ్రామాల్లో ఏ పనిచేసిన, ఏ ఉద్యోగి వేతనా లు ఇవ్వాలన్నా పర్సంటే జీలేనిదే ఎంపీడీఓ బానోతు భద్రునాయక్ పని చేయరని శాయంపేట ఎంపీపీ బాసని రమాదేవి ఆరోపించారు. బుధవారం మండలకేంద్రం లోని ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దొంగ బిల్లులు సృష్టించి సంతకాలు పెట్టమని వేధిం చినట్లు చెప్తున్న ఎంపీడీవో భద్రునాయక్ దేనికి సంబంధించిన బిల్లులో పత్రికా ముఖంగా తెలియజేయాలని అన్నారు. సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ దైనంపల్లి కుమారస్వామికి పనిచేయని నెలల్లో సైతం వేతనాలు చెల్లించే విధంగా ఉన్నతాధికారులకు తన ప్రమేయం లేకుండానే సిఫారసు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ప్రతినెల గ్రామ కోఆర్డినేటర్లకు వచ్చే వేతనాల్లో 50 శాతం పర్సంటేజ్ తీసుకుని ఎంపీడీఓ, ఎంసీఓ పంచుకోవడంలో నిజం లేదా అని అన్నారు. ఎమ్మె ల్యే సీడీఎఫ్ పనులకు వీడీసీ ఇచ్చేందుకు కారోబార్‌ను మధ్యవర్తిగా పంపించిన రోజులను మర్చిపోయారా అన్నారు. అంతేకాకుండా వీడీసీ కోసం తన భర్త మాజీ ఎంపీపీ బాసని చంద్రప్రకాశ్ వద్ద రూ.17 వేలు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక అధికారిగా ఉన్న సమయంలో మండలకేంద్రంలోని మార్కెట్ స్థలంలో చదను చేసే పేరు తో లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆసరా పింఛన్ల పంపిణీలో రూ.50వేల చెక్కును దొంగ బిల్లులు సృష్టించి కాజేసి పత్రిక విలేకరులకు ఇచ్చినం అని చెప్పలేదా అన్ని ప్రశ్నించారు. 

ఆసరా పేరుతో కాజేసీ బిల్లు ఉన్నతాధికారులకు అందిస్తామని ఎంపీపీ చెప్పా రు. ఇప్పటి వరకు మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే ఏ ఒక్క అధికారిని ఎంపీపీగా బెదిరింపులకు గురిచేయలేదన్నారు. ఎంపీడీఓ అవినీతిని ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేసినట్లా అని అన్నారు.  గతంలో పనిచేసిన ఉద్యోగులపై అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి చెప్తాడని అన్నారు. ఇప్పటికైన ఎంపీడీఓ తన తీరు మార్చుకోవాలని సూచించారు. ఆమె వెంట శాయంపేట ఎంపీటీసీ కందగట్ల రవి ఉన్నారు.

>
మరిన్ని వార్తలు