మధుకర్‌ మృతదేహానికి నేడు రీపోస్టుమార్టం

10 Apr, 2017 01:16 IST|Sakshi

సాక్షి,పెద్దపల్లి: మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్‌ మృతదేహానికి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. అనేక మలుపుల తర్వాత జరగనున్న ఈ రీపోస్టుమార్టంపై అందరిలో ఆసక్తి నెలకొంది. సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగినట్టు మర్మంగాలు కోసేశారా?, కళ్లు పీకేశారా?, పోలీసులు చెప్పినట్టు అవేమీ తొలగించబడలేదా? అవి మార్ఫింగ్‌ ఫొటోలేనా? అనే ఉత్కఠకు తెరపడనుంది.

హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుశాఖ కరీంనగర్‌ జిల్లా జడ్జి సమక్షంలో ఉస్మానియా, కాకతీయ మెడికల్‌ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం జరగనుంది. ఈమేరకు ఖానాపూర్‌లో ఏర్పాట్లు చేశారు. రీపోస్టుమార్టం నివేదికను కరీంనగర్‌ జిల్లా జడ్జి సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు పంపనున్నారు. 

మరిన్ని వార్తలు